News September 5, 2025

భార్యకు అధిక ఆదాయముంటే భరణం అక్కర్లేదు: మద్రాస్ HC

image

చెన్నైకి చెందిన వైద్య దంపతుల కేసులో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. భార్యకు ఆదాయం అధికంగా ఉంటే భర్త భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. భార్యకు నెలకు రూ.30 వేలు ఇవ్వాలని విడాకుల సమయంలో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. ఆమెకు అధికంగా ఆదాయం, ఆస్తులు ఉన్నాయని, భరణం ఇవ్వక్కర్లేదని స్పష్టం చేసింది. కుమారుడి చదువుకు డబ్బు ఇచ్చే విషయంలో కోర్టు జోక్యం చేసుకోదని పేర్కొంది.

Similar News

News September 5, 2025

గాజాలో 64వేలు దాటిన మరణాలు

image

గాజాలో మరణాల సంఖ్య 64వేలు దాటినట్లు అధికారులు తెలిపారు. నిన్న ఇజ్రాయెల్ దాడుల్లో 28 మంది మరణించగా వారిలో చిన్నారులు, మహిళలే అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు శాశ్వత కాల్పుల విరమణకు అంగీకరిస్తే 48 మంది బందీలను విడుదల చేస్తామన్న హమాస్ ప్రతిపాదనను ఇజ్రాయెల్ తిరస్కరించింది. యుద్ధంలో ఓడించడమే లక్ష్యమని స్పష్టం చేసింది. 2023 నుంచి ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

News September 5, 2025

కెప్టెన్‌ బవుమా.. ఎదురులేని జట్టుగా ‘SA’

image

సౌతాఫ్రికా క్రికెట్ జట్టు ఎదురన్నదే లేకుండా దూసుకెళుతోంది. టెంబా బవుమా సారథ్యంలో అసాధ్యాలను సుసాధ్యం చేస్తోంది. హేమాహేమీలుగా పేరున్న టీమ్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఆస్ట్రేలియాపై WTC ఫైనల్స్‌లో విజయం, ఆస్ట్రేలియా గడ్డపై ఆసీస్‌తో ODI సిరీస్‌ నెగ్గడం, 27ఏళ్ల తర్వాత తాజాగా ఇంగ్లండ్‌లో వన్డే సిరీస్‌ కైవసం చేసుకోవడం.. ఇవన్నీ బవుమా కెప్టెన్సీలో SA ఎదురులేని జట్టుగా ఎదుగుతోందని చెప్పేందుకు ఉదాహరణలు.

News September 5, 2025

CM చంద్రబాబుకు కొత్త హెలికాప్టర్

image

AP: సీఎం చంద్రబాబు కొత్త హెలికాప్టర్ వినియోగిస్తున్నారు. ఇదివరకు ‘బెల్’ తయారు చేసిన ఛాపర్ వాడేవారు. అది ఎక్కువ దూరం ప్రయాణించేందుకు పనికిరాకపోవడంతో అత్యాధునిక ఫీచర్లతో కూడిన AIR Bus H160 మోడల్ హెలికాప్టర్ వాడుతున్నారు. సన్ లైట్ తగ్గినా, ఆకాశం మేఘావృతమైనా కొన్ని హెలికాప్టర్లకు అనుమతి ఇవ్వరు. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ఛాపర్‌లో లైటింగ్ తక్కువగా ఉన్నా ప్రయాణించేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.