News May 13, 2024
ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదు: ముకేశ్ కుమార్
AP: చిన్నచిన్న ఘటనలు మినహా రాష్ట్రంలో ఓటింగ్ ప్రశాంతంగా ముగిసిందని సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ‘పోలింగ్ భారీగా జరిగింది. అనంతపురం, పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని హింసాత్మక ఘటనలు జరిగాయి. మాచర్ల, పుంగనూరు, పల్నాడు ఘటనలపై చర్యలు తీసుకున్నాం. పల్నాడులో 8 బూత్‌లలో ఈవీఎంలు ధ్వంసం చేశారు. డేటా మొత్తం సేఫ్‌గా ఉంది. ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదు’ అని ఆయన వివరించారు.
Similar News
News January 9, 2025
తొక్కిసలాట బాధితుల్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్
AP: తిరుపతి తొక్కిసలాట బాధితుల్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడి నుంచి తొక్కిసలాట జరిగిన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అధికారుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి స్విమ్స్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు.
News January 9, 2025
తొక్కిసలాట ఘటనపై సమీక్షిస్తున్నా: సీఎం చంద్రబాబు
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘స్విమ్స్‌లో బాధితులను పరామర్శించాను. వారందరితో మాట్లాడాను. ఘటనపై సమీక్షిస్తున్నా. అసలేం జరిగిందన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఆ తర్వాత మీడియా ద్వారా పూర్తి వివరాలు ప్రజలకు తెలియచేస్తాను’ అని తెలిపారు. ఘటన విషయంలో అధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
News January 9, 2025
సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి
TG: ఈ నెల 13 నుంచి 24 వరకు బ్రిస్బేన్, దావోస్‌లలో పర్యటించేందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ బెయిల్ కోసం అప్పట్లో పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించారు. త్వరలో పలు దేశాల పర్యటనకు వెళ్లాల్సి ఉందని, 6 నెలలు పాస్‌పోర్ట్ ఇవ్వాలని ఆయన అభ్యర్థించగా కోర్టు అంగీకరించింది. జులై 6లోగా పాస్‌పోర్టును తిరిగి అప్పగించాలని ఆదేశించింది.