News April 13, 2024
పిఠాపురంపై స్పెషల్ ఫోకస్ అవసరం లేదు: మిథున్‌రెడ్డి

AP: రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటని, దానిపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన అవసరం తమకు లేదని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. భీమవరం, గాజువాకలో ఓడిన పవన్ కళ్యాణ్.. ఈసారి కొత్తగా పిఠాపురంలో ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ సెగ్మెంట్‌లో YCP నుంచి వంగా గీత బలమైన అభ్యర్థి అని పేర్కొన్నారు. మొదటి నుంచి జనసేనలో ఉన్నవారికి పవన్ న్యాయం చేయలేదని విమర్శించారు.
Similar News
News March 28, 2026
ఆంధ్రా అమ్మాయిలు అదరగొట్టారు

న్యూఢిల్లీ వేదికగా జరిగిన బధిర అమ్మాయిల T10 నేషనల్ క్రికెట్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను ఆంధ్రా జట్టు సొంతం చేసుకుంది. ఢిల్లీతో జరిగిన ఫైనల్‌లో 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత ఆంధ్రా 73/4 స్కోర్ చేయగా, ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 68/4 స్కోర్ మాత్రమే చేసి ఓడిపోయింది. టోర్నీలో రాణించిన కాంతమ్మకు ఉమెన్ ఆఫ్ ది సిరీస్, ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కాయి.
News March 28, 2026
ఏడాది పొడవునా కాపునిచ్చే మామిడి!

సాధారణంగా మామిడి వేసవిలోనే దొరుకుతుంది. కానీ రాజస్థాన్‌కు చెందిన రైతు కిషన్ సుమన్ పదేళ్లు శ్రమించి ‘సదాబహార్’ అనే మామిడి రకాన్ని అభివృద్ధి చేశారు. ఇది ఏడాదికి మూడుసార్లు కాపునిస్తూ తియ్యగా, తక్కువ పీచుతో ఉంటుంది. రాష్ట్రపతి భవన్ తోటలోనూ ఇది చోటు సంపాదించుకుంది. మామిడి ప్రియులకు ఏడాది పొడవునా పండ్లను అందించే దిశగా ఇది ఒక విప్లవాత్మక మార్పు. ఈయన 7 రంగుల గులాబీ మొక్కనూ అభివృద్ధి చేశారు.
News March 28, 2026
SRHకు యంగెస్ట్ ఇండియన్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్!

ఇవాళ RCBతో జరిగే మ్యాచ్‌లో కెప్టెన్సీ చేయడం ద్వారా SRH ప్లేయర్ ఇషాన్ కిషన్ అరుదైన ఘనత సాధించనున్నారు. సన్ రైజర్స్‌కు నాయకత్వం వహించనున్న యంగెస్ట్(27Y 253D) ఇండియన్ కెప్టెన్‌గా నిలవనున్నారు. గతంలో శిఖర్ ధవన్, మనీశ్ పాండే, భువనేశ్వర్ కాస్త లేటు వయసులో సారథ్యం చేపట్టారు. ఓవరాల్‌గా ఈ జాబితాలో విలియమ్సన్(27Y 244D) టాప్‌లో ఉన్నారు. కేన్ మామ 2018లో తొలిసారి SRHను లీడ్ చేసిన విషయం తెలిసిందే.


