News January 7, 2025

నయనతారకు నోటీసులు ఇవ్వలేదు: నిర్మాతలు

image

నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో ‘చంద్రముఖి’ సినిమాలోని క్లిప్పింగ్స్ వాడుకున్నందుకు నయనతారకు తాము నోటీసులు ఇచ్చినట్లు వచ్చిన వార్తలను నిర్మాతలు ఖండించారు. తాము రూ.5కోట్లు డిమాండ్ చేయలేదని శివాజీ ప్రొడక్షన్స్ సంస్థ స్పష్టం చేసింది. ఆమె తమ నుంచి ముందే NOC తీసుకున్నారని తెలిపింది. కాగా ఈ డాక్యుమెంటరీలో ‘నానుం రౌడీదాన్’ క్లిప్స్ వాడినందుకు నయన్‌పై హీరో ధనుష్ రూ.10కోట్లకు దావా వేసిన విషయం తెలిసిందే.

Similar News

News January 8, 2025

విచారణకు సహకరించకపోతే చర్యలు తప్పవు: KTR నోటీసులో ACB

image

TG: విచారణకు న్యాయవాదిని అనుమతించడం కుదరదని KTRకు ఇచ్చిన 2వ నోటీసులో ACB పేర్కొన్నట్లు తెలుస్తోంది. ‘న్యాయవాది సమక్షంలో విచారణ కోరడం నిబంధనలకు విరుద్ధం. లాయర్‌ను అనుమతించలేదనే సాకుతో విచారణ తప్పించుకుంటున్నారు. విచారణ తర్వాత మీ సమాధానం ఆధారంగా ఏ డాక్యుమెంట్లు తీసుకురావాలనేది చెబుతాం. వాటిని సమర్పించేందుకు సమయం ఇస్తాం. విచారణకు సహకరించకపోతే తదుపరి చర్యలు తప్పవు’ అని పేర్కొంది.

News January 8, 2025

విమెన్ బాడీ స్ట్రక్చర్‌పై కామెంట్లు సెక్సువల్ హరాస్‌మెంటే: హైకోర్టు

image

విమెన్ బాడీ స్ట్రక్చర్‌పై కామెంట్లు చేయడం లైంగిక నేరం కిందకే వస్తుందని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. KSEBలోని మహిళా ఉద్యోగి పెట్టిన కేసును క్వాష్ చేయాలని మాజీ ఉద్యోగి వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. 2013 నుంచి అతడు వల్గర్‌గా మాట్లాడుతూ అసభ్య మెసేజులు పంపిస్తూ కాల్స్ చేసేవాడు. బాడీ స్ట్రక్చర్‌పై కామెంట్లు నేరం కాదని అతడు వాదించగా, మహిళ చూపిన సందేశాల్లో నేర ఉద్దేశం కనిపిస్తోందని కోర్టు ఏకీభవించింది.

News January 8, 2025

గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ నిర్మాతలకు షాక్

image

AP: గేమ్ ఛేంజర్, <<15068245>>డాకు మహారాజ్<<>> సినిమాల టికెట్ రేట్ల పెంపును 10 రోజులకు పరిమితం చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. 14 రోజుల వరకు <<15065900>>టికెట్ రేట్ల పెంపునకు<<>> ప్రభుత్వం అనుమతినివ్వగా, దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.