News March 30, 2025
సన్న బియ్యం పథకాన్ని ఎవరూ రద్దు చేయలేరు: CM రేవంత్

TG: సన్న బియ్యం పథకాన్ని ఎవరూ రద్దు చేయలేరని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా ఈ పథకం కొనసాగుతుందని తెలిపారు. కేసీఆర్ హయాంలో రూ.11వేల కోట్ల రుణమాఫీ చేస్తే, తాము అధికారంలోకి వచ్చాక ఆర్నెల్లలోనే రూ.25 వేల కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర తమదని చెప్పారు. రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తామని రేవంత్ పేర్కొన్నారు.
Similar News
News November 27, 2025
కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు

AP: దిత్వా తుఫాను ప్రభావంతో రేపు GNT, బాపట్ల, ప్రకాశం, NLR, ATP, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు APSDMA తెలిపింది. ‘శనివారం అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో అతిభారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఆదివారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సుంది’ అని పేర్కొంది.
News November 27, 2025
ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న సిటీ ఏదో తెలుసా?

ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన నగరంగా ఇండోనేషియాలోని జకార్తా నిలిచింది. అక్కడ 4.19 కోట్ల మంది నివసిస్తున్నారు. 3.66 కోట్లతో బంగ్లాదేశ్‌లోని ఢాకా రెండో స్థానంలో ఉంది. టోక్యో(జపాన్) 3.34 కోట్ల జనాభాతో మూడో స్థానం, 3 కోట్ల మందితో ఢిల్లీ నాలుగో స్థానంలో ఉన్నాయి. 2050 నాటికి ఢాకా ఈ లిస్టులో తొలి స్థానానికి చేరే అవకాశం ఉందని ప్రపంచ అర్బనైజేషన్ ప్రాస్పెక్ట్స్-2025 రిపోర్టులో ఐక్యరాజ్యసమితి తెలిపింది.
News November 27, 2025
తొలిరోజు నామినేషన్లు ఎన్నో తెలుసా?

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. తొలిరోజు 3,242 సర్పంచ్, 1,821 వార్డు పదవులకు నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి విడతలో ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న వాటిని పరిశీలిస్తారు. డిసెంబర్ 3 వరకు విత్‌డ్రాకు అవకాశం ఉంటుంది. తొలి దశలో 4,236 గ్రామాలకు, 37,440 వార్డులకు పోలింగ్ జరగనుంది. కాగా తొలి విడత పోలింగ్ డిసెంబర్ 11న నిర్వహించనున్నారు.


