News August 30, 2025
ధనుష్ కంటే గొప్పగా ‘కలాం’ పాత్రను ఎవరూ చేయలేరు: రౌత్

భారతరత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం బయోపిక్‌లో లీడ్ రోల్‌ను పోషించేందుకు తమిళ నటుడు ధనుష్ అంగీకరించినందుకు సంతోషంగా ఉన్నానని డైరెక్టర్ ఓంరౌత్ తెలిపారు. ‘ధనుష్ కంటే గొప్పగా కలాం పాత్రలో ఎవరూ నటించలేరు. ఆయన ఒక అద్భుతమైన నటుడు. ఆయనతో పనిచేసేందుకు ఇష్టపడే వ్యక్తిని నేను. కలాం జీవితంలో ఏ భాగాన్ని చేర్చాలో లేదా వదిలేయాలో ఎంచుకోవడం ఓ సవాల్’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
Similar News
News January 24, 2026
అలర్ట్.. 149 మిలియన్ల పాస్‌వర్డ్‌లు లీక్

ప్రపంచ వ్యాప్తంగా 149M(దాదాపు 15కోట్లు) యూజర్‌నేమ్‌లు, పాస్‌వర్డ్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయినట్లు సైబర్ నిపుణులు గుర్తించారు. ఇందులో Gmail, FB, ఇన్‌స్టా, నెట్‌ఫ్లిక్స్, బ్యాంకింగ్, క్రిప్టో అకౌంట్ల వివరాలు ఉన్నాయి. ఇన్‌ఫోస్టీలర్ మాల్‌వేర్ ద్వారా ఈ సమాచారం చోరీ అయినట్లు తెలుస్తోంది. వినియోగదారులు పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని, ప్రతి అకౌంట్‌కు వేర్వేరుగా స్ట్రాంగ్‌గా ఉండేవి పెట్టుకోవాలని సూచిస్తున్నారు.
News January 24, 2026
రథ సప్తమి పూజ ఎందుకు చేయాలి?

సూర్యుడు జన్మించిన రోజు కాబట్టి దీన్ని ‘సూర్య జయంతి’గా జరుపుకొంటారు. సూర్యరశ్మి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి, చర్మ వ్యాధులు, కంటి సమస్యల నుంచి విముక్తి కోసం ఈ పూజ చేస్తారు. రథసప్తమి రోజున ఆచరించే అరుణోదయ స్నానం, సూర్యారాధన వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఆయురారోగ్యాలు, సంతాన ప్రాప్తి, సకల కార్యసిద్ధి కోసం భక్తులు ఈ పర్వదినాన్ని అత్యంత నిష్టతో జరుపుకొంటారు.
News January 24, 2026
పొద్దుతిరుగుడులో తెగుళ్ల నివారణకు ఇలా..

వరి కోతల తర్వాత పొద్దుతిరుగుడు పంటను దుక్కి పద్ధతిలో రైతులు విత్తుకుంటారు. అయితే పంట తొలి దశలో చీడపీడలు, నెక్రోసిస్ వైరస్ తెగులు నివారణకు ఒక కిలో విత్తనానికి థయోమిథాక్సామ్ 3.గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 5ML కలిపి శుద్ధి చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 2-3టన్నుల పశువుల ఎరువు వేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. అవసరాన్ని బట్టి ఎకరాకు 30KGల నత్రజని, 36KGల భాస్వరం, 12KGల పొటాషియం వేసుకోవాలి.


