News November 4, 2024

కూటమిని ఎవరూ చెడగొట్టలేరు: పవన్ కళ్యాణ్

image

AP: రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉందని, కూటమిని ఎవరూ చెడగొట్టలేరని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పిఠాపురంలో ఆయన మాట్లాడారు. వ్యక్తులు చేసే తప్పులపై చర్యలు ఉంటాయన్నారు. తాను, చంద్రబాబు చాలా క్లారిటీగా ఉన్నామని, కొంతమంది వ్యక్తులు చేసే ప్రయత్నాలు తమను ఏం చేయలేవని ఆయన చెప్పారు.

Similar News

News February 14, 2026

జమాత్ గెలుపు… భారత్‌కు సమస్యేనా!

image

బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఇండియాను ఆనుకొని ఉన్న సరిహద్దు సీట్లలో పాక్ అనుకూల ‘జమాత్-ఏ-ఇస్లామీ’ గెలవడం ఆందోళనకరమని రిపబ్లిక్ TV వ్యాఖ్యానించింది. అది 68 స్థానాలు గెలవగా మన దేశ సరిహద్దు వెంబడి ఉన్న దాదాపు అన్ని సీట్లు ఆ పార్టీ ఖాతాలో ఉన్నాయంది. చికెన్ నెక్ కారిడార్‌, WB, మేఘాలయ, త్రిపుర, అస్సాంను ఆనుకొని ఉన్న సీట్లలో గెలిచిన జమాత్ భారత్‌ వ్యతిరేక రాడికలైజేషన్‌ను పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

News February 14, 2026

మరో 2 కిలోలు తగ్గడమే లక్ష్యమంటున్న లోకేశ్

image

AP: మంత్రి లోకేశ్ ఇటీవల మరింత వెయిట్ లాసై ఫిట్‌గా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘బరువు మరీ ఎక్కువ తగ్గుతున్నానని అంతా అంటున్నారు. కానీ ఇంకో 2 కిలోలు తగ్గితే నా లక్ష్యం పూర్తవుతుంది. అటు రోజూ కొంతమంది నేతలతో డిన్నర్ చేసి వాళ్ల బాగోగులు తెలుసుకోవడం PM మోదీ నుంచి నేర్చుకున్నా. క్వాంటం, AI సీఎం చూసుకుంటారు. నేను మానవీయ సంబంధాలు చూసుకుంటా’ అని అసెంబ్లీ లాబీలో నేతలతో లోకేశ్ అన్నారు.

News February 14, 2026

40 తర్వాత ఆహారంలో ఇవి చేర్చుకోండి

image

వ‌య‌స్సు మీద ప‌డుతున్న కొద్దీ క‌చ్చితంగా ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోవాలంటున్నారు నిపుణులు. 40 ఏళ్ల‌కు పైబ‌డిన త‌రువాత జంక్ ఫుడ్‌కు పూర్తిగా స్వ‌స్తి చెప్పి ఆహారంలో టమాటాలు, చిల‌గ‌డదుంప‌లు, కోడిగుడ్లు, పుట్ట గొడుగులు, యాపిల్ పండ్లు, బాదం తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో అజీర్తి, గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ద‌కం తగ్గుతాయి. కొలెస్ట్రాల్‌, బీపీ నియంత్ర‌ణ‌లో ఉండి గుండెజబ్బులు రాకుండా ఉంటాయని చెబుతున్నారు.