News May 12, 2024
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ఎవరూ టచ్ చేయలేరు: మోదీ

మమతా బెనర్జీ పాలనలో చొరబాటుదారులు అభివృద్ధి చెందుతున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. బరాక్పూర్లో మాట్లాడుతూ.. ‘ఇక్కడి ప్రజలకు 5 గ్యారంటీలు ఇస్తున్నా. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు లేదు. SC, ST, OBC రిజర్వేషన్లను ఎవరూ టచ్ చేయలేరు. శ్రీరామ నవమి జరుపుకోకుండా మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. రామ మందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రద్దు కాదు. CAA అమలును ఎవరూ అడ్డుకోలేరు’ అని స్పష్టం చేశారు.
Similar News
News November 16, 2025
అరుదైన రికార్డు.. దిగ్గజాల జాబితాలో జడేజా

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమ్ ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు నెలకొల్పారు. టెస్టుల్లో 4 వేల పరుగులు, 300 వికెట్ల ఘనత సాధించిన క్రికెటర్గా నిలిచారు. ఈ జాబితాలో కపిల్ దేవ్, ఇయాన్ బోథమ్, డానియెల్ వెటోరీ వంటి దిగ్గజాలు ఉండటం గమనార్హం. జడేజా నిన్న బ్యాటింగ్లో 27 పరుగులు చేసి, 4 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం అతడి ఖాతాలో 4017 రన్స్, 342 వికెట్స్ ఉన్నాయి.
News November 16, 2025
కార్తీకంలో నదీ స్నానం చేయలేకపోతే?

కార్తీక మాసంలో నదీ స్నానం చేయలేని భక్తులకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. స్నానం చేసే నీటిలో గంగాజలం/నదీ జలాన్ని కలుపుకొని స్నానమాచరించవచ్చు. ఇది నదీ స్నానం చేసినంత పుణ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. అది కూడా సాధ్యం కాకపోతే, స్నానం చేసేటప్పుడు ‘గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ…’ అనే మంత్రాన్ని జపించాలని పండితులు సూచిస్తున్నారు. ఫలితంగా నదీ స్నానం చేసిన ఫలం లభిస్తుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.
News November 16, 2025
తెలంగాణ న్యూస్ అప్డేట్స్

*స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు పార్టీపరంగా కాకుండా చట్టబద్ధంగా ఇవ్వాలని CM రేవంత్ను R.కృష్ణయ్య కోరారు. నేడు రాష్ట్రంలో BC న్యాయసాధన దీక్షలు చేయనున్నారు.
*BRS కార్యకర్తలపై తాము దాడి చేశామని KTR చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని జూబ్లీహిల్స్ MLAగా ఎన్నికైన నవీన్ యాదవ్ తెలిపారు.
*సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ACB మరోసారి దాడులు చేసింది. సబ్ రిజిస్ట్రార్ల ఇళ్లలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.


