News June 14, 2024
చట్టానికి ఎవరూ అతీతులు కాదు: నటి రమ్య

హత్య కేసులో హీరో దర్శన్, నటి పవిత్ర గౌడ అరెస్ట్పై మరో కన్నడ నటి రమ్య స్పందించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. ‘కర్ణాటక పోలీసులు రాజకీయ ఒత్తిడులకు లొంగిపోరు. చట్టంపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు. జస్టిస్ ఫర్ రేణుకాస్వామి’ అని ఆమె రాసుకొచ్చారు. కాగా పవిత్రకు రేణుకాస్వామి అసభ్యకర సందేశాలు పంపడంతో అతడిని దర్శన్ కొట్టి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు.
Similar News
News September 15, 2025
DANGER: నిద్ర మాత్రలు వాడుతున్నారా?

నిద్ర పట్టేందుకు కొందరు స్లీపింగ్ పిల్స్ వాడుతుంటారు. అయితే వీటి వాడకం ఎక్కువైతే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. జ్ఞాపకశక్తి తగ్గడం, తల తిరగడం, ఆందోళన, మెదడు బద్ధకించడం, చూపు అస్పష్టంగా మారడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు. వరుసగా 2 రోజులు ఈ మాత్రలు వేసుకుంటే బానిసలవుతారని, డోస్ పెంచాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు. వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
News September 15, 2025
రాష్ట్రానికి 41,170 మెట్రిక్ టన్నుల యూరియా: అచ్చెన్న

AP: రాష్ట్రానికి 41,170 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 18వ తేదీలోపు కృష్ణపట్నం పోర్ట్ ద్వారా 11,605, కాకినాడ ద్వారా 18,765, మంగళూరు ద్వారా 2,700, జైగడ్ పోర్ట్ ద్వారా 8,100 MT యూరియా రవాణా జరుగుతుందని వెల్లడించారు. YCP కావాలనే యూరియా సరఫరాపై అబద్ధాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. రైతులను భయపెట్టి ప్రయోజనం పొందాలన్న ప్రయత్నం విజయవంతం కాదని హితవు పలికారు.
News September 15, 2025
ప్రియుడితో నటి ఎంగేజ్మెంట్?

రూమర్డ్ బాయ్ఫ్రెండ్ రచిత్ సింగ్తో బాలీవుడ్ నటి హుమా ఖురేషీ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. యాక్టింగ్ కోచ్ అయిన రచిత్తో హుమా ఏడాదికి పైగా డేటింగ్లో ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు పలు సందర్భాల్లో సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. ఈక్రమంలోనే ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. వీటిపై హుమా స్పందించాల్సి ఉంది.