News January 9, 2025
వెంటిలేటర్‌పై ఎవరూ లేరు: సత్యకుమార్

AP: తొక్కిసలాట ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గాయపడినవారి పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందన్నారు. ఎవరూ కూడా వెంటిలేటర్‌పై లేరన్నారు. తొక్కిసలాటకు కారణాలు దర్యాప్తులో తేలుతుందని చెప్పారు. బాధితుల ఆవేదనను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూస్తామన్నారు. ఇంకా 29 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు.
Similar News
News October 24, 2025
జన్నారం: 9 నెలల చిన్నారితో కలిసి తల్లి సూసైడ్

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జన్నారం మండలం మందపల్లిలో బావిలో దూకి తల్లి తన 9నెలల కూతురితో కలిసి సూసైడ్ చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News October 24, 2025
‘గూగుల్ తల్లి’ గుండెల్లో Ai గుబులు

గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌కు ఇకపై టెస్టింగ్ టైమ్. చాట్ GPT ఈమధ్యే అట్లాస్ Ai బ్రౌజర్ లాంఛ్ చేయగా మైక్రోసాఫ్ట్ తన కోపైలట్ సాఫ్ట్‌వేర్‌ను ఎడ్జ్ బ్రౌజర్లో ఇంటిగ్రేట్ చేస్తోంది. కాగా ఇప్పటికే జెమిని Aiని బ్రౌజర్లో గూగుల్ చేర్చి సెర్చ్ రిజల్ట్స్ చూపిస్తోంది. కానీ యూజర్లు ఇక్కడే కంటెంట్ పొంది సైట్లకు వెళ్లక యాడ్ రెవెన్యూపై ప్రభావం పడుతోందట. అటు పోటీ ఇటు ఆర్థిక పోట్లతో గూగుల్‌కు డెంట్ తప్పదు అన్పిస్తోంది.
News October 24, 2025
పాక్‌కు షాక్.. నీళ్లు వెళ్లకుండా అఫ్గాన్‌లో డ్యామ్!

పాక్‌కు నీళ్లు వెళ్లకుండా నియంత్రించాలని అఫ్గాన్ ప్లాన్ చేస్తోంది. కునార్ నదిపై వీలైనంత త్వరగా డ్యామ్ నిర్మించాలని తాలిబన్ సుప్రీంలీడర్ మౌలావీ హైబతుల్లా అఖుంద్జాదా ఆదేశాలిచ్చారు. విదేశీ కంపెనీల కోసం చూడకుండా దేశీయ కంపెనీలతోనే ఒప్పందం చేసుకోవాలని సూచించారు. 2 దేశాల మధ్య సరిహద్దు ఘర్షణల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత <<16207281>>సింధూ జలాల<<>> ఒప్పందాన్ని భారత్ నిలిపేయడం తెలిసిందే.


