News May 26, 2024
నా బాధను ఎవరూ అర్ధం చేసుకోలేదు: శ్రేయస్

వన్డే WC తర్వాత తాను తీవ్ర వెన్నునొప్పితో బాధపడినట్లు KKR కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపారు. కానీ తన బాధను ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయినప్పుడు బాధనిపించిందని పేర్కొన్నారు. కాగా WC అనంతరం వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు అయ్యర్ ప్రకటించారు. మరో వైపు ఆయనకు ఎలాంటి గాయాలు లేవని NCA ప్రకటించింది. ఈ గందరగోళం నేపథ్యంలో అయ్యర్‌ను సెంట్రల్ కాంట్రాక్టు నుంచి BCCI తప్పించింది.
Similar News
News January 6, 2026
ఒమన్‌లో పెళ్లికి ముందు హెల్త్ చెకప్ తప్పనిసరి!

ఒమన్‌లో ఇకపై పెళ్లి చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా హెల్త్ చెకప్ చేయించుకోవాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. జనవరి 1 నుంచి ఈ రూల్ అమల్లోకి వచ్చింది. జంటలో ఒకరు విదేశీయులైనా ఈ టెస్టులు కంపల్సరీ. జన్యుపరమైన వ్యాధులను గుర్తించడం, హెపటైటిస్, HIV వంటి వైరస్లు ఒకరి నుంచి మరొకరికి లేదా పుట్టబోయే బిడ్డకు సోకకుండా చూడటం దీని ప్రధాన ఉద్దేశం. రిజల్ట్స్‌ను మూడో వ్యక్తికి చెప్పొద్దనే నియమం పెట్టారు.
News January 6, 2026
కుజ దోష నివారణకు శుభప్రదం ‘మంగళ వారం’

జాతకంలో కుజ దోషంతో సమస్యలు ఎదుర్కొనే వారు మంగళవారం నాడు ప్రత్యేక పూజలు చేయడం విశేష ఫలితాలుంటాయి. కుజుడికి అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామిని, హనుమంతుడిని ఆరాధిస్తే దోష తీవ్రత తగ్గుతుంది. ఎరుపు దుస్తులు ధరించి పూజ చేయాలి. కందులు దానం చేయడం, కుజ అష్టోత్తరం పఠించడం వల్ల జాతకంలోని ప్రతికూలతలు తొలగి సుఖశాంతులు చేకూరుతాయి. భక్తితో చేసే ఈ పరిహారాలు మానసిక ధైర్యాన్ని ఇచ్చి కార్యసిద్ధికి మార్గం చూపుతాయి.
News January 6, 2026
ఇంటర్వ్యూతో ఎయిమ్స్ మంగళగిరిలో ఉద్యోగాలు

ఏపీ: మంగళగిరిలోని <


