News February 9, 2025
రేషన్ కార్డులపై ఎలాంటి ఆదేశాలివ్వలేదు: ఈసీ

TG: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి బ్రేక్ వేసినట్లు జరుగుతున్న ప్రచారంపై ఈసీ వివరణ ఇచ్చింది. రేషన్ కార్డుల జారీని నిలిపివేయాలని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని, మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది.
Similar News
News October 25, 2025
నాగుల చవితి.. ఇవాళ ఇలా చేస్తే?

కార్తీక మాసంలో నాలుగో రోజు వచ్చే పండుగ ‘నాగుల చవితి’. ఇవాళ నాగ పూజకు ఉదయం 8.59 నుంచి 10.25am వరకు శుభ సమయమని పండితులు చెబుతున్నారు. ఇవాళ నాగులను పూజిస్తే కుజ దోషం, కాలసర్ప దోషం, కళత్ర దోషం తొలుగుతాయని అంటున్నారు. పుట్టలో పాలు పోసి 5 ప్రదక్షిణలు చేయాలని పండితులు సూచిస్తున్నారు. సంతానం లేనివారు, పెళ్లి కాని వారు పూజిస్తే ఫలితాలు ఉంటాయని అంటున్నారు.
News October 25, 2025
SAILలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SAIL) అనుబంధ సంస్థ<
News October 25, 2025
నాగుల చవితి: పుట్టలో పాలెందుకు పోస్తారు?

నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోస్తే సర్వరోగాలు తొలగిపోతాయని నమ్మకం. యోగశాస్త్రం ప్రకారం.. మానవ శరీరంలో వెన్నుపాములోని మూలాధార చక్రంలో కుండలినీ శక్తి పాము రూపంలో నిద్రిస్తూ ఉంటుంది. ఇది కామ, క్రోధాలనే విషాలను కక్కుతూ సత్వగుణాన్ని హరిస్తుంది. నేడు పుట్టలో పాలు పోసి నాగ దేవతను ఆరాధిస్తే.. ఈ అంతర్గత విషసర్పం శుద్ధమై, శ్వేతత్వాన్ని పొందుతుంది. ఫలితంగా మోక్ష మార్గం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.


