News September 25, 2024
దేశంలో ఏ ప్రాంతాన్నీ పాకిస్థాన్ అనొద్దు: సుప్రీంకోర్టు

ఏ వర్గం పైనా క్యాజువల్ కామెంట్స్ చేయొద్దని జడ్జిలను సుప్రీంకోర్టు అప్రమత్తం చేసింది. దేశంలోని ఏ ప్రాంతాన్నీ పాకిస్థాన్‌గా పిలవొద్దని ఆదేశించింది. అది భారత ప్రాంతీయ సార్వభౌమత్వానికి వ్యతిరేకమేనని తెలిపింది. KA హైకోర్టు జడ్జి, జస్టిస్ వీ శ్రీశానందన్ ఓ కేసులో బెంగళూరులోని ముస్లిం ఆధిపత్య ప్రాంతాన్ని పాకిస్థాన్ అనడం, మహిళా లాయర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైరల్ వీడియోల కేసును సుమోటోగా విచారించింది.
Similar News
News September 18, 2025
వైసీపీ ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌దే నిర్ణయం: అచ్చెన్నాయుడు

AP: యూరియాతో సహా అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో అన్నారు. YCP నేతలు ఇకనైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. కుంటిసాకులతో సభకు రావట్లేదని, వైసీపీ MLAల అనర్హత వేటుపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్రతిపక్ష నేతగానూ జగన్ పనికిరారని జనం పక్కనపెట్టారని ఎద్దేవా చేశారు. జగన్ ప్రతిపక్ష హోదా అడగటం మాని, అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు.
News September 18, 2025
అరాచకమే.. సందీప్ వంగాతో మహేశ్ మూవీ?

రాజమౌళితో సినిమా తర్వాత మహేశ్ బాబు చేసే మూవీ విషయమై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీని కోసం మైత్రీ మూవీ మేకర్స్, ఏషియన్ సునీల్ పోటీలో ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో మూవీ చేయాలని మహేశ్‌ను సునీల్ కోరినట్లు తెలిపాయి. కాల్షీట్ల ఆధారంగా దీనిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందన్నాయి. దీంతో సందీప్, మహేశ్ కాంబినేషన్ కుదిరితే అరాచకమేనని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.
News September 18, 2025
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ వాడకంపై నిషేధం!

ప్లాస్టిక్ నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో నిషేధించాలని నిర్ణయించింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. డిసెంబర్ 31 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో చెత్తను పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే అమరావతి సచివాలయంలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నారు.