News October 11, 2025

ట్రంప్‌కు నో’శాంతి’.. SMలో మీమ్స్ చూశారా?

image

ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి రాకపోవడంపై సోషల్ మీడియాలో మీమ్స్ పుట్టుకొస్తున్నాయి. ‘ఐ వాంట్ మై నోబెల్’ అంటూ ఆయన ఏడుస్తున్నట్లు ఎడిట్ చేసిన ఫొటోలు వైరలవుతున్నాయి. ట్రంప్ కోపంగా, నిరాశగా, బాధపడుతున్నట్లుగా ఫొటోలు, వీడియోలు రూపొందించి నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఆయనకు ప్రైజ్ రానందుకు తాము సంతోషంగా ఉన్నామంటున్నారు. కాగా తాను ఇప్పటివరకు 7 యుద్ధాలు ఆపానని ట్రంప్ చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే.

Similar News

News October 11, 2025

మొదటిసారి మేకప్ వేసుకుంటున్నారా?

image

కొత్తగా మేకప్ ప్రయత్నించాలనుకొనే వారికోసం ఈ చిట్కాలు. ముందు మీ స్కిన్ టైప్ ఏంటో గుర్తించాలి. డ్రై, ఆయిలీ, నార్మల్ ఇలా..దాన్ని బట్టి కాస్మెటిక్స్ ఎంచుకోవాలి. ముందు ముఖానికి మాయిశ్చరైజర్ రాయాలి. తర్వాత ఫౌండేషన్. ఇది మీ చర్మటోన్, టెక్స్‌చర్‌కు సరిపోయేలా ఉండాలి. డార్క్‌సర్కిల్స్‌కు కన్సీలర్ వాడాలి. కళ్లకు ఐలైనర్, కనురెప్పలకు మస్కారా, పెదాలకు లిప్‌లైనర్, లిప్‌స్టిక్ వేసుకోవాలి. <<-se>>#BeautyTips<<>>

News October 11, 2025

Colgate పేరుతో నకిలీ టూత్ పేస్టులు

image

ఇప్పటిదాకా కల్తీ పాలు, అల్లం పేస్టులు, ఆయిల్ ప్యాకెట్లు బయటపడగా తాజాగా నకిలీ టూత్ పేస్టులు కలకలం రేపుతున్నాయి. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో Colgate పేరుతో రెడీ చేసిన ఫేక్ టూత్ పేస్ట్ బాక్స్‌లు భారీగా బయటపడ్డాయి. చిత్రోడ్ ప్రాంతంలో పోలీసులు దాడులు చేసి వీటిని పట్టుకున్నారు. సుమారు రూ.9.43 లక్షల విలువైన సరకును స్వాధీనం చేసుకున్నారు. దీని సప్లై చైన్ తెలుసుకునేందుకు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

News October 11, 2025

‘చిత్త కార్తె’ అంటే ఏంటి?

image

జ్యోతిష శాస్త్రం ప్రకారం అశ్విని నుంచి రేవతి వరకు 27 నక్షత్రాలు ఉన్నాయి. సూర్యుడు ప్రతి నక్షత్రంలో 13-14 రోజులు ఉంటాడు. ఏ నక్షత్రంలోకి ప్రవేశిస్తే ఆ కాలాన్ని ఆ కార్తె పేరుతో అని పిలుస్తారు. సమస్త ప్రాణకోటితో పాటు ప్రకృతి ప్రవర్తనలపై ఇవి ప్రభావం చూపుతాయి. భానుడు ఇవాళ చిత్త నక్షత్రంలోకి ప్రవేశిస్తుండటంతో చిత్త కార్తె ప్రారంభం అవుతోంది.
* ఇలాంటి ఆసక్తికర కంటెంట్ కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.