News October 3, 2024

ఆ ఇళ్లకు నో పర్మిషన్: CM రేవంత్ రెడ్డి

image

TG: ఇంకుడు గుంతలు నిర్మించని ఇళ్లకు పర్మిషన్ ఇవ్వబోమని CM రేవంత్ స్పష్టం చేశారు. ‘హైదరాబాద్‌లో ఒకప్పుడు 200 ఫీట్ల లోపే బోర్ పడేది. ఇప్పుడు 1,200 ఫీట్లు వేసినా లాభం ఉండట్లేదు. ఇంకుడు గుంతలు కట్టని ఇళ్లకు అనుమతులు ఇవ్వొద్దని అధికారులకు ఆదేశాలిచ్చా. అలాంటి ఇళ్లకు నీళ్ల ట్యాంకర్ ద్వారా నీళ్లిస్తే రెండింతలు అదనంగా వసూలు చేయాలని చెప్పా. నగరాన్ని బాగు చేసేందుకే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నా’ అని తెలిపారు.

Similar News

News January 23, 2026

UCILలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు

image

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (<>UCIL<<>>) 8 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి MBBS, సంబంధిత PG అర్హత గల అభ్యర్థులు జనవరి 30న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. నెలకు జీతం 2 ఏళ్ల అనుభవం ఉన్నవారికి రూ.80,500, 5 ఏళ్ల అనుభవం ఉన్నవారికి రూ.1,00,600, 9 ఏళ్ల అనుభవం ఉన్నవారికి రూ.1,20,600 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.uraniumcorp.in

News January 23, 2026

వీరు ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ చేయ‌కూడ‌దు

image

బ‌రువు త‌గ్గ‌డానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుకోవ‌డానికి చాలామంది ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. రోజులో 16 గంట‌లు ఉప‌వాసం ఉండి 8 గంట‌లు ఆహారాన్ని తీసుకుంటారు. దీన్ని స‌రిగ్గా పాటించకపోతే హైపోగ్లైసీమియా, హైప‌ర్‌గ్లైసీమియాకి దారి తీస్తుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అలాగే గ‌ర్భిణీ స్త్రీలు, పాలిచ్చే త‌ల్లులు, ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఈ పద్ధతిని పాటించడం సరికాదంటున్నారు.

News January 23, 2026

తేనెలొలుకు లలితా దేవి పలుకు

image

ఓసారి లలితా దేవి కోరిక మేరకు సరస్వతీ దేవి వీణాగానం చేయగా అందరూ ఆ సంగీతానికి పరవశించిపోయారు. అప్పుడు లలితాంబిక ‘సుష్టు'(బాగుంది) అని అనగానే ఆ గళమాధుర్యం ముందు తన వీణాగానం చిన్నబోయిందని భావించి శారదాదేవి వీణను పక్కన పెట్టేసింది. సంగీత దేవతే మెచ్చినంత సుమధురమైనవి లలితా దేవి పలుకులని ఈ వృత్తాంతం వివరిస్తుంది. ఈ విషయాన్ని లలిత సహస్రనామాల్లో ‘నిజసంలాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ’ అనే నామంలో ఉంటుంది.