News August 15, 2024

దినేశ్ కార్తీక్ టీమ్‌లో ధోనీకి నో ప్లేస్!

image

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ తన ఆల్ టైమ్ ఇండియా ప్లేయింగ్ 11ను ప్రకటించారు. ఇందులో రోహిత్, కోహ్లీలకు చోటివ్వగా, ఎంఎస్ ధోనీని ఎంపిక చేయకపోవడం గమనార్హం.

DK టీమ్: సెహ్వాగ్, రోహిత్ శర్మ, ద్రవిడ్, సచిన్, కోహ్లీ, యువరాజ్, రవీంద్ర జడేజా, అశ్విన్, అనిల్ కుంబ్లే, బుమ్రా, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్(12th man).

Similar News

News December 24, 2025

పళ్ల ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..

image

పళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే పాలు, పెరుగు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటినుంచి దంతాలకు కావాల్సిన క్యాల్షియం, ఫాస్ఫరస్ అందుతాయి. పాలకూర, తోటకూర తినడం వల్ల విటమిన్ A, C, ఫోలేట్ అందుతాయి. ఆపిల్స్, క్యారట్స్, నారింజ, మామిడి, ఉసిరికాయలు, చేపలు, గుడ్లు తినాలి. తీపి పదార్థాలు, చిప్స్, స్పైసీ ఫుడ్స్ తినడం తగ్గించాలంటున్నారు. పంటి ఆరోగ్యం బావుంటే మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుందని సూచిస్తున్నారు.

News December 24, 2025

రూ.100 కోట్ల అక్రమాస్తులు.. కిషన్ నాయక్‌కు 14 రోజుల రిమాండ్

image

TG: మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. కొన్నిరోజులుగా ఆయన నివాసాల్లో చేస్తున్న <<18652795>>సోదాల్లో<<>> పలు జిల్లాల్లో 40 ఎకరాల పొలం, హోటళ్లు, భారీగా బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.100 కోట్ల పైగానే ఉంటుందని సమాచారం.

News December 24, 2025

విత్తనాలు కొంటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

‘విత్తు మంచిదైతే మొక్క మంచిదవుతుంది’ అందుకే పంట అధిక దిగుబడి, ఆదాయం కోసం తప్పనిసరిగా నాణ్యమైన విత్తనాన్ని ఎంచుకోవాలి. ఆయా ప్రాంతాలకు అనువైన విత్తన రకాలను స్థానిక వ్యవసాయ అధికారుల సూచనల మేరకు తీసుకోవాలి. విత్తనాలను కొనుగోలు చేసే క్రమంలో రైతులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకునేందుకు <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.