News January 19, 2025

శాంసన్‌కు CTలో నో ప్లేస్.. రాజకీయ దుమారం

image

సంజూ శాంసన్‌ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయకుండా కెరీర్‌ను నాశనం చేశారని MP శశిథరూర్ ఆరోపించారు. ఈ విషయంలో KCAకు బాధ లేదా అని ప్రశ్నించారు. SMAT, VHTల మధ్య ట్రైనింగ్‌కు హాజరుకానందుకు చింతిస్తూ ఆయన లేఖ రాసినా వేటు వేశారని మండిపడ్డారు. ఈ విషయంపై KCA ప్రెసిడెంట్ జార్జ్ స్పందిస్తూ శాంసన్ క్రమశిక్షణ పాటించలేదన్నారు. VHTలో ఆడకపోవడం వల్లే జాతీయ జట్టుకు దూరమయ్యారనేది తాను చెప్పలేనని పేర్కొన్నారు.

Similar News

News November 1, 2025

కాశీబుగ్గ ఘటన.. మృతులు వీరే

image

AP: 1.ఏడూరి చిన్నమ్మి(50)-రామేశ్వరం(టెక్కలి), 2.రాపాక విజయ(48)-పిట్టలసరి(టెక్కలి), 3.మురిపింటి నీలమ్మ(60)-దుక్కవానిపేట-పల్లిఊరు(వజ్రపుకొత్తూరు), 4.దువ్వు రాజేశ్వరి(60)-బెలుపతియా(మందస), 5.చిన్ని యశోదమ్మ(56)-శివరాంపురం(నందిగం), 6.రూప-గుడ్డిభద్ర(మందస), 7.లోట్ల నిఖిల్(13)-బెంకిలి(సోంపేట), 8.డొక్కర అమ్ముదమ్మ-పలాస, 9.బోర బృందావతి(62)- మందస. మరో వ్యక్తి ఆస్పత్రిలో మృతిచెందగా వివరాలు తెలియాల్సి ఉంది.

News November 1, 2025

చంద్రబాబువి పిట్టలదొర మాటలు: జగన్

image

AP: తుఫాను నిర్వహణపై CM చంద్రబాబువి పిట్టలదొర మాటలని YCP చీఫ్ జగన్ ఎద్దేవా చేశారు. ‘వైపరీత్యాల వేళ రైతులకు శ్రీరామరక్షగా నిలిచే ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దుచేయడం బెటర్ మేనేజ్‌మెంట్ అవుతుందా? మొంథా తుఫాను వల్ల నష్టపోయిన బీమాలేని రైతులకు దిక్కెవరు? మీ 18నెలల కాలంలో 16సార్లు వైపరీత్యాల వల్ల రైతులు నష్టపోతే రూ.600CR ఇన్ పుట్ సబ్సిడీ బకాయి పెట్టారు. ఒక్కపైసా పంట నష్ట పరిహారం ఇవ్వలేదు’ అని ఆరోపించారు.

News November 1, 2025

ఈ కోళ్లు రోజూ గుడ్లు పెడతాయని తెలుసా?

image

పౌల్ట్రీ పరిశ్రమలో అధిక గుడ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి BV 380 రకం కోళ్లు. ఇవి వేడి, తేమ వాతావరణాలకు అనుకూలం. ఏడాదిలో 308 గుడ్లు పెట్టడం ఈ కోళ్ల ప్రత్యేకత. BV 380 కోడి పిల్లలను 18-20 వారాల పాటు పెంచిన తర్వాత అవి గోధుమ రంగులో పెద్ద గుడ్లను పెడతాయి. ఇవి ఏడాది పాటు గుడ్లు పెట్టి తర్వాత ఆపేస్తాయి. అప్పుడు వాటిని మాంసం కోసం విక్రయించవచ్చు. ✍️ రోజూ ఇలాంటి సమాచారానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.