News April 14, 2025
ప్రస్తుతం పెళ్లి ఆలోచన లేదు: తమన్నా

విజయ్ వర్మతో బ్రేకప్ వార్తలు వస్తున్న వేళ తమన్నా పెళ్లిపై స్పందించారు. ప్రస్తుతానికి వివాహం చేసుకునే ఆలోచన లేదని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ప్రేమను వ్యాపారంగా చూస్తే సమస్యలొస్తాయని <<15926914>>మిల్కీ బ్యూటీ,<<>> రిలేషన్షిప్లో సంతోషం, బాధలను స్వీకరిస్తేనే సంతోషంగా ఉంటామని విజయ్ ఇటీవల కామెంట్ చేశారు. దీంతో వీరు విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై వీరిద్దరూ ఇప్పటి వరకు స్పందించలేదు.
Similar News
News April 15, 2025
ముంబై ఫెయిల్యూర్‌కు రోహితే కారణం: మాజీ క్రికెటర్

ఓపెనర్‌గా రోహిత్ శర్మ రాణించకపోవడం కారణంగానే ముంబై ఇండియన్స్ ఫెయిల్ అవుతోందని భారత మాజీ క్రికెటర్ అంజుమ్ చోప్రా వ్యాఖ్యానించారు. ముంబై పైచేయి సాధించాలంటే హిట్‌మ్యాన్ దూకుడుగా ఆడాలన్నారు. కాగా రోహిత్ ఈ సీజన్లో ఐదు మ్యాచ్‌ల్లో 0, 8, 13, 17, 18 పరుగులు మాత్రమే చేశారు. MI ఆరు మ్యాచ్‌ల్లో 4 ఓడిపోయి పాయింట్స్ టేబుల్లో ఏడో స్థానంలో ఉంది.
News April 15, 2025
ఏడాదిలో గిరిజన యూనివర్సిటీ నిర్మాణం: సీఎం

AP: VZM(D) మెంటాడ(మ) కుంటినవలసలో నిర్మిస్తున్న కేంద్ర గిరిజన యూనివర్సిటీ నిర్మాణం ఏడాదిలోగా పూర్తి చేయాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వర్సిటీకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సిబ్బంది నియామకం కోసం ప్రధానికి లేఖ రాస్తానని తనను కలిసిన వర్సిటీ వీసీ, అధికారులకు CBN బదులిచ్చారు. 561 ఎకరాల ప్రాంగణం ఉన్న ఈ యూనివర్సిటీలో ప్రస్తుతం 600 మంది విద్యార్థులు చదువుతున్నారు.
News April 15, 2025
గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు.. టీజీపీఎస్సీ క్లారిటీ

గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ కొందరు దురుద్దేశంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీజీపీఎస్సీ తెలిపింది. దీని వెనుక ప్రైవేటు కోచింగ్ సెంటర్లు ఉన్నాయని పేర్కొంది. ప్రోటోకాల్ ప్రకారమే నిపుణులతో వాల్యూయేషన్ చేయించినట్లు స్పష్టం చేసింది. లిమిటెడ్ మార్కుల పరీక్షల్లో ఒకే మార్కులు రావడం సహజమని తేల్చి చెప్పింది.