News December 7, 2024
నో పవర్ షేరింగ్ ఫార్ములా: డీకే శివకుమార్

CM సిద్దరామయ్య, తన మధ్య ఎలాంటి పవర్ షేరింగ్ ఫార్ములా లేదని DK శివకుమార్ స్పష్టం చేశారు. ఈ విషయంలో పార్టీ నేతలెవరూ మాట్లాడవద్దన్నారు. తానెప్పుడూ ఏ ఫార్ములా గురించి మాట్లాడలేదని, రాజకీయ అవగాహనతో ఇద్దరం కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. అధికారంలోకి రాకముందే CMతో ఒప్పందం కుదిరిందని ఇటీవల DK వ్యాఖ్యానించగా, అలాంటి ఒప్పందం ఏమీ లేదని CM కొట్టిపారేశారు. దీంతో రచ్చ మొదలైంది.
Similar News
News November 17, 2025
డెలివరీకి సిద్ధంగా ఉన్నారా?

ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవగానే ఇంట్లోకి సంతోషం వచ్చేస్తుంది. ఈ సంతోషం కలకాలం ఉండాలంటే సరైన ఆర్థిక ప్రణాళిక ఉండాలంటున్నారు నిపుణులు. ప్రెగ్నెన్సీ, డెలివరీ సమయాల్లో ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసుకోవాలి. బిడ్డ పుట్టిన తర్వాత ఏడాది పాటు దుస్తులు, ఆహారం, వస్తువులు, మందులు ఇలా అన్నింటికీ సరిపడా పొదుపు చేసుకోవాలి. ఏది అవసరమో.. ఏది కాదో చూసి కొనుక్కోవాలి. ఎమర్జెన్సీ కోసం కాస్త డబ్బు దాచి ఉంచాలి.

హసీనాకు మరణశిక్ష.. స్పందించిన భారత్

బంగ్లాదేశ్ మాజీ PM షేక్ హసీనాకు ఆ దేశ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు మరణశిక్ష విధించడంపై భారత్ స్పందించింది. ‘పొరుగు దేశ ప్రజల ప్రయోజనాలకు IND కట్టుబడి ఉంటుంది. బంగ్లాలో శాంతి, ప్రజాస్వామ్యం, స్థిరత్వం నెలకొల్పేందుకు సహకారం అందిస్తాం’ అని పేర్కొంది. కాగా బంగ్లా అల్లర్ల తర్వాత భారత్కు పారిపోయి వచ్చిన హసీనాకు కేంద్రం ఆశ్రయం కల్పించింది. అయితే ఆమెను అప్పగించాలని బంగ్లా ప్రభుత్వం కోరుతోంది.