News April 15, 2025

కెరీర్ పట్ల ఎలాంటి రిగ్రెట్ లేదు: భువనేశ్వర్

image

తన కెరీర్ గురించి స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సాధించిన ఘనతల పట్ల సంతృప్తిగా, కృతజ్ఞతతో ఉన్నట్లు చెప్పారు. ఎలాంటి ఫిర్యాదులు గానీ పశ్చాత్తాపం గానీ లేదన్నారు. ఇంతకుమించి తానేమీ కోరుకోవట్లేదని పేర్కొన్నారు. ఈ స్వింగ్ బౌలర్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2022 నవంబర్‌లో ఆడారు. ఈ సీజన్‌లో ఆర్సీబీ తరఫున ఆడుతున్న భువీ IPLలో అత్యధిక వికెట్లు(187) తీసిన పేసర్‌గా ఉన్నారు.

Similar News

News January 17, 2026

గ్రీన్‌లాండ్‌ విషయంలోనూ టారిఫ్ అస్త్రం

image

గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో US అధ్యక్షుడు ట్రంప్ మరోసారి టారిఫ్ అస్త్రాన్ని ఉపయోగించనున్నారు. ఈ విషయంలో అమెరికాకు మద్దతు ఇవ్వని దేశాలపై భారీ సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. గతంలో టారిఫ్ బెదిరింపులతో యూరప్ దేశాలను ఒప్పించిన విషయాన్ని గుర్తు చేశారు. అదే వ్యూహాన్ని గ్రీన్‌లాండ్ విషయంలోనూ అమలు చేస్తానని ట్రంప్ స్పష్టం చేశారు.

News January 17, 2026

అత్త యేలిన కోడలూ, చిత్త పట్టిన చేనూ

image

పూర్వకాలంలో, అత్త ఇంటి వ్యవహారాలను, కోడలి ప్రవర్తనను, పనులను దగ్గరుండి పర్యవేక్షించేవారు. ఆ పర్యవేక్షణ, క్రమశిక్షణ వల్ల కోడలు ఇంటి పనులన్నీ నేర్చుకుని సమర్థవంతంగా వ్యవహరించేదని, దాని వల్ల ఆ ఇల్లు చక్కగా ఉండేదని నమ్మేవారు. అలాగే రైతు తన మనసు పెట్టి, ఇష్టంగా, శ్రద్ధగా సాగు చేసుకునే పొలం మంచి దిగుబడిని, ఫలితాన్ని ఇస్తుంది. ఏదైనా ఒక పనిని అంకిత భావంతో చేస్తే మంచి ఫలితం వస్తుందని ఈ సామెత చెబుతుంది.

News January 17, 2026

నేడు ప్రయాణాలు చేయవచ్చా?

image

కనుమ రోజు ఊరు దాటొద్దనే సంప్రదాయం ఉంది. అందుకే ఇంటికొచ్చిన ఆడపడుచులను తిరిగి పంపరు. కానుకలు ఇచ్చి గౌరవంగా చూసుకుంటారు. ఇక ముక్కనుమ విషయానికి వస్తే ప్రయాణాలకు అనువైన రోజని పండితులు చెబుతున్నారు. అయితే కొందరు ఈరోజు కూడా పండుగ వాతావరణం ఉంటుందని బయలుదేరడానికి సంకోచిస్తుంటారు. కానీ ముక్కనుమ నాడు ప్రయాణాలు చేయకూడదని ఎటువంటి శాస్త్ర నియమాలు లేవు. కాబట్టి కనుమ నాడు ఆగి, ముక్కనుమ రోజున ప్రయాణాలు చేయవచ్చు.