News October 15, 2024
అవకతవకలకు ఆస్కారం లేదు.. EVMలపై CEC
EVMలపై విపక్షాల అభ్యంతరాలపై CEC రాజీవ్ కుమార్ స్పందించారు. ఓటింగ్లో పాల్గొని ప్రజలే ఈ విషయంలో తీర్పు ఇచ్చారని పేర్కొంటూ విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చారు. ‘ఓటింగ్లో పాల్గొనడం ద్వారా ప్రజలే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. EVMలలో అవకతవకలకు ఏ మాత్రం ఆస్కారం లేదు. ఈ రోజు మళ్లీ వారు (విపక్షాలు) ప్రశ్నలు లేవనెత్తితే వాటికి మరోసారి సమాధానమిస్తాము’ అని పేర్కొన్నారు.
Similar News
News January 3, 2025
శ్రీవారికి గత ఏడాది రూ.1365 కోట్ల ఆదాయం
తిరుమలేశుడికి గత ఏడాది హుండీ ద్వారా సమకూరిన ఆదాయం వివరాలను టీటీడీ తాజాగా వెల్లడించింది. స్వామివారికి 2024లో రూ.1365 కోట్లు వచ్చాయని పేర్కొంది. మొత్తంగా 2.55 కోట్లమంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారని, వారిలో 99లక్షలమంది తలనీలాలు సమర్పించారని తెలిపింది. 12.44 కోట్ల లడ్డూల్ని విక్రయించామని స్పష్టం చేసింది.
News January 3, 2025
బంగ్లా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న శాంటో
బంగ్లాదేశ్ ఆటగాడు నజ్ముల్ హొస్సేన్ శాంటో టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నారు. బంగ్లా క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని ప్రకటించింది. ఆయన తమకు సమాచారాన్ని అందించారని, ఆ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని పేర్కొంది. టెస్టులు-వన్డేల్లో శాంటోనే కెప్టెన్గా కొనసాగుతారని వెల్లడించింది. దగ్గర్లో టీ20 సిరీస్ లేని నేపథ్యంలో కొత్త కెప్టెన్ ఎవరన్నదానిపై ఇంకా ఆలోచించడం లేదని స్పష్టం చేసింది.
News January 3, 2025
గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్.. 54మంది మృతి
గాజాలోని హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ మరోమారు వైమానిక దాడులతో విరుచుకుపడింది. పలు ప్రాంతాలపై చేసిన ఈ దాడుల్లో తమ పౌరులు కనీసం 54మంది మృతిచెందారని, అనేకమంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని గాజా యంత్రాంగం ప్రకటించింది. అమాయకులైన పౌరులు తలదాచుకున్న శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడిందని మండిపడింది. కాగా.. మిలిటెంట్లే లక్ష్యంగా దాడులు నిర్వహించామని ఇజ్రాయెల్ వివరణ ఇచ్చింది.