News November 15, 2024
కులగణనతో ఏ పథకం రద్దు కాదు: సీఎం రేవంత్
TG: కులగణన వల్ల ఏ ఒక్క సంక్షేమ పథకం తొలగిపోదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చిల్డ్రన్స్ డే వేడుకల సందర్భంగా మాట్లాడిన ఆయన, ఈ సర్వే ఒక మెగా హెల్త్ చెకప్ లాంటిదని చెప్పారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు అందాలన్నా, సామాజిక న్యాయం జరగాలన్నా కులగణన జరగాలని అన్నారు. కొంత మంది దీనిపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
Similar News
News November 15, 2024
కస్తూరికి ముందస్తు బెయిల్ నిరాకరణ
తెలుగువారిపై <<14525601>>వివాదాస్పద<<>> వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరికి మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. తనపై తమిళనాడులో పలు కేసులు నమోదైన నేపథ్యంలో ఆమె దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. కస్తూరి మాటలు విద్వేషపూరితమేనని, తెలుగువారిని కించపర్చడమేనని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసినవారెవరైనా విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. కాగా ఆమె పరారీలో ఉన్న విషయం తెలిసిందే.
News November 15, 2024
స్కూళ్లకు కీలక ఆదేశాలు
AP: ప్రభుత్వ స్కూళ్ల ఆవరణల్లో వివాహాలు, రాజకీయ, మతపరమైన సమావేశాలను నిషేధిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. పాఠశాలల పనివేళలకు ముందు, తర్వాత, సెలవుల్లో ఇలాంటి కార్యక్రమాలకు ఆర్జేడీలు, డీఈవోలు, HMలు అనుమతిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఇకపై ఎట్టిపరిస్థితుల్లోనూ అలాంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వొద్దని స్పష్టం చేసింది.
News November 15, 2024
‘సివిల్స్’కు ఉచిత శిక్షణ.. 24 వరకు దరఖాస్తులు
AP: యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ ప్రైమరీ, మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ వెల్లడించింది. అర్హత గల బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ నెల 24లోపు బీసీ సంక్షేమ సాధికార కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని తెలిపింది. ఈ నెల 27న నిర్వహించే స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఉచిత హాస్టల్, భోజన వసతి కూడా ఉంటుంది. బీసీ 66%, ఎస్సీ 20%, ఎస్టీ 14% చొప్పున ఎంపిక చేస్తారు.