News August 3, 2024

సిబ్బందీ లేరు.. పడకలూ లేవు: కాగ్

image

TG: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలున్నాయని, ఆస్పత్రుల్లో భారీగా పడకల లోటు ఉందని కాగ్ తాజా నివేదికలో తెలిపింది. ‘వైద్య, ఆరోగ్య శాఖల్లో మంజూరైన పోస్టులకు, అందుబాటులో ఉన్న సిబ్బందికి సంబంధమే లేదు. ఏకంగా 45శాతం కొలువులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర జనాభాకు 35,004 పడకలు అవసరం కాగా 27,996 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వైద్యకళాశాలల్లో సిబ్బంది కొరతా తీవ్రంగానే ఉంది’ అని వెల్లడించింది.

Similar News

News March 29, 2026

GK: జీవశాస్త్రం విశేషాలు

image

☛ మానవ శరీరంలో అతి చిన్న ఎముక: స్టెపిస్ (చెవిలో ఉంటుంది)
☛ అతి పెద్ద ఎముక: ఫీమర్ (తొడ ఎముక)
☛ అతిపెద్ద అవయవం: చర్మం
☛ కణజాలాల అధ్యయనాన్ని ఏమంటారు?: హిస్టాలజీ
☛ రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్నది: విలియం హార్వే (ENG)
☛ రక్తపోటును కొలిచే పరికరం: స్పిగ్మోమానోమీటర్
☛ యూనివర్సల్ డోనర్ బ్లడ్ గ్రూప్: O నెగటివ్

News March 29, 2026

IPL: టాస్ గెలిచిన MI

image

ముంబైలోని వాంఖడే స్టేడియంలో KKRతో జరుగుతున్న మ్యాచ్‌లో MI టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
MI: రోహిత్, రికెల్టన్, తిలక్, హార్దిక్, రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, శార్దూల్, మార్కండే, ఘజన్‌ఫర్, బౌల్ట్, బుమ్రా
KKR: అలెన్, రహానే, గ్రీన్, రఘువంశీ, రింకూ, రమణ్‌దీప్, అనుకుల్ రాయ్, నరైన్, వరుణ్, అరోరా, ముజరబానీ

News March 29, 2026

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ఫలితాలు విడుదల

image

TG: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 174 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెరిట్ జాబితా విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్ 1న HYDలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఇందులో గైనకాలజీ, అనస్తీషియా వంటి కీలక విభాగాలున్నాయి. ఇక 2,312 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల తుది ఫలితాలను ఏప్రిల్ 9న వెల్లడిస్తామని రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. ఈ నియామకాలతో ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.