News November 5, 2024

‘మ్యూజికల్ ఛైర్’లాంటిది ఉండదు: ఫడ్నవీస్

image

MH ఎన్నికల వేళ CM పదవిపై Dy cm దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహాయుతి కూటమి గెలిస్తే ‘మ్యూజికల్ ఛైర్’ లాంటిది ఉండదన్నారు. మిత్రపక్షాలన్నీ కలిసి CMను నిర్ణయిస్తాయని స్పష్టం చేశారు. ఏక్‌నాథ్ షిండే సహా కూటమిలోని ఏ నాయకుడూ ఆ పదవిని డిమాండ్ చేయలేడని, నిర్ణయం న్యాయంగా ఉంటుందని అంతా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. కాగా మహాయుతి మరోసారి అధికారంలోకి వస్తే ఫడ్నవీసే CM అవుతారని ప్రచారం జరుగుతోంది.

Similar News

News February 4, 2026

కాలం చెల్లిన పురుగుమందులు వాడితే?

image

పంటల్లో పురుగులను చంపడానికి వాడే మందులు గడువు దాటినా ఇబ్బందేముందని కొందరు అనుకుంటారు. కానీ అలాంటివి వాడటం ఏమాత్రం మంచిదికాదు. కాలం చెల్లిన మందులకు రసాయనశక్తి తగ్గడంతో పురుగులు చావకపోగా మరింత విజృంభిస్తాయి. కొన్ని రకాల మందులు హానికరమైన కెమికల్స్‌గా మారిపోతాయి. దీనివల్ల పంట ఎండిపోతుంది. ఇవి స్ప్రే చేసిన రైతులకు ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. కాబట్టి మందులను కొనేటప్పుడు ఎక్స్‌పైర్ డేట్ చూడండి.

News February 4, 2026

అరక అరిగిన గరిసె విరుగును

image

‘అరక’ అంటే పొలం దున్నడానికి ఉపయోగించే నాగలి. ‘గరిసె’ అంటే ధాన్యాన్ని నిల్వచేసే కొట్టం. ఒక రైతు తన నాగలి అరిగిపోయేంత కష్టపడి పొలం దున్నితే, ఆ శ్రమకు తగిన ఫలితం దక్కుతుందని, ధాన్యం దిగుబడి విపరీతంగా పెరిగి, ధాన్యాగారా(గరిసె)లు నిండిపోతాయని దీని అర్థం. ఎంత కష్టపడి శ్రమిస్తే, అంత గొప్ప ఫలితాలు లభిస్తాయి అనే నీతిని ఈ సామెత తెలియజేస్తుంది.

News February 4, 2026

ప్రేమ, కరుణకు కేంద్రం ‘అనాహత చక్రం’

image

ఛాతీ మధ్యలో ఉండే ఈ చక్రం ప్రేమ, కరుణకు కేంద్రం. ఇది సమతుల్యంగా ఉంటే అందరిపై నిస్వార్థమైన ప్రేమ, క్షమాగుణం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. అస్థిరత ఏర్పడితే ఒంటరితనం, గుండె సంబంధిత ఇబ్బందులు, ఇతరులపై ద్వేషం కలుగుతాయి. దీనిని ఉత్తేజితం చేయడానికి ‘యం’ మంత్రాన్ని జపించాలి. ఆకుపచ్చని ప్రకృతిలో సమయం గడపడం, ప్రాణాయామం చేయడం, సాటి జీవుల పట్ల దయతో మెలగడం వల్ల ఈ చక్రం అద్భుతంగా పని చేస్తుంది.