News March 31, 2025
ఆ 400 ఎకరాలపై సర్వే జరగలేదు: హెచ్‌సీయూ

TG: గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి తమదేనని TGIIC <<15947111>>ప్రకటించడాన్ని<<>> హెచ్‌సీయూ ఖండించింది. 2024 జులైలో వర్సిటీ ప్రాంగణంలో సర్వే జరగలేదని, పరిశీలన మాత్రమే చేశారని పేర్కొంది. భూముల హద్దుల నిర్ణయానికి తాము అంగీకరించలేదని తెలిపింది. ఈ ప్రాంతంలోని పర్యావరణం, జీవవైవిధ్యాన్ని కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. వర్సిటీకి కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం ఉండాలంది.
Similar News
News April 2, 2025
దేశంలో 13వేల చదరపు కి.మీ.ల అటవీ భూముల కబ్జా

దేశంలోని 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 13వేల చదరపు కిలోమీటర్ల అటవీ భూములు ఆక్రమణలకు గురయ్యాయని కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా MPలో 5,460.9 Sqkm భూములు కబ్జాకు గురైనట్లు నివేదికలో తెలిపింది. APలో 133.18 చదరపు కి.మీల భూమి ఆక్రమణకు గురైందని పేర్కొంది. మొత్తం ఆక్రమిత భూముల్లో 409.77 Sqkm తిరిగి స్వాధీనం చేసుకున్నామంది. కాగా తెలంగాణ, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ వివరాలు ఇవ్వలేదని తెలిపింది.
News April 2, 2025
ఏపీలో 3 రోజులపాటు తేలికపాటి వర్షాలు

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఇవాళ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో చెదురుమదురు వానలు పడతాయని తెలిపింది. అలాగే గురువారం రాయలసీమ, అల్లూరి జిల్లాలోని కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం ఉత్తరాంధ్ర, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
News April 2, 2025
శ్రీశైల మల్లన్నకు రూ.6.10కోట్ల ఆదాయం

AP: శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం 27 రోజులకు గానూ రూ.6.10కోట్లు వచ్చినట్లు దేవాలయ అధికారులు తెలిపారు. దీంతో పాటు 20.1 తులాల బంగారం, 6.2 కిలోల వెండిని భక్తులు సమర్పించినట్లు చెప్పారు. అదే విధంగా 990 యూఎస్ డాలర్లు, ఇతర దేశాల కరెన్సీ కూడా హుండీలో వేసినట్లు పేర్కొన్నారు. ఇటీవల ఉగాది వేడుకల సందర్భంగా శ్రీశైలానికి భక్తులు పోటెత్తిన విషయం తెలిసిందే.