News August 25, 2024

వారికి బదిలీలు లేవు: ప్రభుత్వం

image

AP: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల్లోని ఎవరైనా వచ్చే ఏడాది మార్చి 31లోపు రిటైర్ అవుతుంటే వారికి సాధారణ బదిలీలు చేయబోమని ప్రభుత్వం తెలిపింది. ప్రజా ప్రయోజనం కోసమే ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. వేరే ఏ ఇతర పరిస్థితుల్లోనూ బదిలీలు ఉండవని స్పష్టం చేశారు.

Similar News

News March 19, 2026

ALERT: ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడతాయని APSDMA హెచ్చరించింది. శ్రీకాకుళం, VZM, మన్యం, అల్లూరి, పోలవరం, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, NLR, కర్నూలు, నంద్యాల, ATP, సత్యసాయి, కడప, చిత్తూరు, TPTYలో తేలికపాటి-మోస్తరు వర్షాలు, మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. కాగా చిత్తూరు, కడపలోని పలు ఏరియాల్లో ఇప్పటికే వర్షం కురుస్తోంది.

News March 19, 2026

వచ్చే నెలలో క్యాబినెట్ విస్తరణ!

image

TG: ఏప్రిల్ తొలి వారంలో రాష్ట్ర క్యాబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ అనుమతించిందని తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రివర్గంలో ఖాళీల భర్తీ, ఒకరిద్దరు కొత్త వారిని తీసుకోవడంపై అధిష్ఠానంతో CM రేవంత్ చర్చించారని సమాచారం. పలువురి శాఖలు మార్చేందుకూ పర్మిషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తరచూ వివాదాస్పదమవుతున్న మంత్రిపై వేటు పడుతుందని, కొత్తగా లంబాడా నేతకు ఛాన్స్ దక్కనుందని చర్చ సాగుతోంది.

News March 19, 2026

LPG గ్యాస్ ATM.. ఎక్కడంటే..?

image

దేశంలో గ్యాస్ కొరత నేపథ్యంలో హరియాణాలోని గురుగ్రామ్‌లో ఏర్పాటైన ‘LPG గ్యాస్ ATM’ వైరలవుతోంది. BPCL పైలట్ ప్రాజెక్టుగా ఇటీవల స్మార్ట్ వెండింగ్ మెషీన్ ఏర్పాటు చేసింది. 24×7 ఓపెన్‌లో ఉండే ఈ ATM నుంచి వినియోగదారులు 2-3 నిమిషాల్లోనే సిలిండర్ తీసుకోవచ్చు. పైగా ఐరన్‌వి కాకుండా ఫైబర్ సిలిండర్లు ఇస్తారు. వీటి బరువు 15 KGలే కావడంతో ఈజీగా తీసుకెళ్లొచ్చు. మన దగ్గరా ఇలాంటివి వస్తే బాగుంటుంది కదూ. మీరేమంటారు?