News November 30, 2024
కోల్కతా ఆసుపత్రిలో బంగ్లాదేశీలకు నో ట్రీట్మెంట్

కోల్కతాలోని JN రే ఆసుపత్రి సంచలన నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్కు చెందిన పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇవ్వబోమని ప్రకటించింది. అన్ని ఆసుపత్రులూ ఇదే పాటించాలని కోరింది. బంగ్లాదేశ్లో హిందువులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, ఆ దేశంలో భారతీయ జెండాను తొక్కుతూ అవమానించారని అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. హిందువులను కాపాడాలంటూ విదేశాంగశాఖ బంగ్లాను కోరిన మరునాడే ఆసుపత్రి ఈ నిర్ణయం తీసుకుంది.
Similar News
News October 29, 2025
డేటా లీక్.. వెంటనే పాస్వర్డ్స్ మార్చుకోండి!

భారీ డేటా ఉల్లంఘనలో 183 మిలియన్లకు పైగా ఈమెయిల్ పాస్వర్డ్లు లీక్ అయినట్లు AUS సైబర్ సెక్యూరిటీ నిపుణుడు ట్రాయ్ హంట్ ధ్రువీకరించారు. వీటిలో Gmail ఖాతాల వివరాలు కూడా ఉన్నాయి. మాల్వేర్ ద్వారా దొంగిలించిన లాగిన్ ఐడీలతో మొత్తం 3.5 టెరాబైట్ల (875 HD సినిమాలకు సమానం) డేటాను హ్యాకర్స్ రూపొందించారు. మీ ఖాతా వివరాలు లీక్ అయ్యాయో లేదో తనిఖీ చేసుకుని, వెంటనే పాస్వర్డ్లు మార్చుకోవాలని ట్రాయ్ సూచించారు.
News October 29, 2025
అరటి పరిమాణం పెంచే ‘బంచ్ ఫీడింగ్’ మిశ్రమం

అరటి కాయల పరిమాణం పెరుగుదలకు భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ బంచ్ ఫీడింగ్ మిశ్రమం రూపొందించింది. 100ml నీటిలో 7.5 గ్రా. నత్రజని ఎరువు, 7.5 గ్రాముల పొటాష్ ఎరువు కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని 500 గ్రాముల పేడలో బాగా కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని పైన ఫొటోలో చూపినట్లు కాయలు కాసిన తర్వాత క్రింది పువ్వును కత్తిరించి, ఆ మిశ్రమం ఉన్న పాలిథిన్ సంచిలో కాయలు కాసిన కాడకు ఒక అడుగు దూరం వదిలి గట్టిగా కట్టాలి.
News October 29, 2025
వైకుంఠాన్ని చేర్చే మార్గం కార్తీకమాసం

పుణ్యకాలాలన్నింటిలోకెల్లా కార్తీకమాసం అత్యుత్తమమైనది. వేదాల కంటే గొప్ప శాస్త్రం, గంగ కంటే గొప్ప తీర్థం, భార్యతో సమానమైన సుఖం, ధర్మంతో సమానమైన స్నేహం లేనట్టే.. ఈ కార్తీక మాసానికి సాటి వచ్చే పుణ్య కాలం లేదు. కార్తీక దామోదరుని (విష్ణువు) కంటే గొప్ప దైవం మరొకరు లేరు. ఈ సత్యాన్ని తెలుసుకొని, ఈ మాసంలో భక్తితో ధర్మాన్ని ఆచరించే వ్యక్తి తప్పక వైకుంఠాన్ని చేరుకుంటాడని మన శాస్త్రాలు చెబుతున్నాయి.<<-se>>#Karthikam<<>>


