News October 1, 2024

బడులు, గుడుల సమీపంలో నో వైన్ షాప్: ఎక్సైజ్ కమిషనర్

image

AP: ఈ నెల 12 నుంచి కొత్త మద్యం విధానం అమలుకు ప్రయత్నిస్తామని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ వెల్లడించారు. ‘MRP కంటే అధిక రేటుకు విక్రయిస్తే చర్యలు తప్పవు. పర్మిట్ రూమ్‌లు, బెల్ట్ షాపులకు అనుమతి లేదు. స్కూళ్లు, ఆలయాలకు వంద మీటర్ల పరిధిలో మద్యం షాపుల ఏర్పాటుకు అనుమతి లేదు. ప్రతి షాపులో 2 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. కొత్త విధానం అమల్లోకి వచ్చేవరకూ పాత విధానమే అమల్లో ఉంటుంది’ అని ఆయన వెల్లడించారు.

Similar News

News January 23, 2026

కేసీఆర్ చుట్టే ప్రశ్నలు?

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో KTRను HYD సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలోని సిట్ బృందం రెండు గంటలుగా ప్రశ్నిస్తోంది. కాగా పదే పదే కేసీఆర్ చుట్టే ఆయన్ను ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్‌కు పర్మిషన్ ఇచ్చిందెవరు? ఎవరు చేయమని చెప్పారు? అనే ప్రశ్నలతో పాటు ట్యాపింగ్‌కు కేసీఆర్ కారణమా? అనే యాంగిల్‌లో ప్రశ్నలు సంధిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

News January 23, 2026

ఫోన్ ట్యాపింగ్ నేరం కాదనేది ప్రజలు గుర్తించాలి: RS ప్రవీణ్

image

TG: ఫోన్ ట్యాపింగ్ నేరం కాదనేది ప్రజలు గుర్తించాలని BRS నేత RS ప్రవీణ్ కుమార్ చెప్పారు. ‘దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం ట్యాపింగ్ చేయడం సర్వసాధారణం. ఇలా చేయొచ్చని చట్టమే చెబుతోంది. ఫోన్లు, ఈమెయిల్స్ ట్యాపింగ్ చేస్తున్నామని గతంలో మన్మోహన్ పార్లమెంటులో చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో ట్యాపింగ్ జరుగుతున్నా ఎక్కడా చర్చ లేదు. దేశ భద్రతకు సంబంధించిన అంశాన్ని ఈ ప్రభుత్వం బజారున పడేసింది’ అని మండిపడ్డారు.

News January 23, 2026

వింతల ప్రపంచం.. గ్రీన్‌లాండ్ ప్రత్యేకతలివే

image

ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్‌లాండ్‌లో 80% ప్రాంతం మంచుతోనే నిండి ఉంటుంది. కేవలం 56,000 జనాభా కలిగిన ఈ దేశంలో ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లడానికి రోడ్లు ఉండవు. పడవలే ప్రయాణ సాధనం. ఇక్కడి గాలి, నీరు ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైనవి. చెట్లు దాదాపుగా లేని ఈ గడ్డపై ప్రజలు మనుగడకు వేట, ఫిషింగ్‌పైనే ఆధారపడతారు. డెన్మార్క్, ఐస్‌లాండ్ నుంచి మాత్రమే చేరుకోగల ఈ దేశంలో అర్ధరాత్రి సూర్యుణ్ని చూడొచ్చు.