News April 21, 2024
కూటమికి చిరంజీవి మద్దతులో ఆశ్చర్యమేం లేదు: సజ్జల

AP: కూటమి అభ్యర్థులకు చిరంజీవి మద్దతు ప్రకటించడంలో ఆశ్చర్యమేమీ లేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ‘చిరంజీవే కాదు, ఎంతమంది కలిసొచ్చినా కూటమికి ఒరిగేదేమీ లేదు. ఏపీలో గుంటనక్కలు, తోడేళ్లు ఒక్కటయ్యాయి. అవి ఒకవైపు, జగన్ ఒక్కడే ఒకవైపు. జనం ఆయనతోనే ఉన్నారు. జగన్ ఈనెల 25న నామినేషన్ వేస్తారు. 2 రోజుల్లో మేనిఫెస్టో విడుదల చేస్తాం’ అని స్పష్టం చేశారు.
Similar News
News March 24, 2026
గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్ శ్రీహర్ష

గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగ్గా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష పంచాయతీ అధికారులకు సూచించారు. తాగునీటి సరఫరా మెరుగ్గా అందించేందుకు గ్రామాల్లో నీటి సరఫరా పథకాలను ప్రాధాన్యత క్రమంలో మరమ్మతులు చేయించాలన్నారు. గ్రామాల్లో చేపడుతున్న తాగునీటి సరఫరా పనుల ప్రచారం సరిగ్గా ఉండాలని తెలిపారు. OHSR-నిర్మాణం చేపడితే MLA లేదా ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి శంకుస్థాపన చేయాలన్నారు.
News March 24, 2026
‘ధురంధర్-2’ బ్యాన్ చేయాలని కోర్టుకు..

ధురంధర్-2 సినిమాను బ్యాన్ చేయాలంటూ ఓ న్యాయవాది మద్రాస్ హైకోర్టును మౌఖికంగా కోరినట్లు Live Law వెల్లడించింది. ‘ఈ చిత్రంలో రాజకీయ అంశాలున్నాయి. TN ఎన్నికల వేళ ఈ సినిమాను ప్రదర్శించకూడదు’ అని పేర్కొన్నట్లు తెలిపింది. అయితే చిత్రంపై అభ్యంతరం ఉంటే ముందుగా రిట్ పిటిషన్ దాఖలు చేసి, ఆ తర్వాత అత్యవసర విచారణ కోరాలని ధర్మాసనం ఆదేశించింది. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
News March 24, 2026
భద్రాద్రి రాముడిపై వివాదం.. హైకోర్టు ఏం చెప్పిందంటే?

TG: భద్రాద్రి రామయ్య గోత్ర నామాల <<19454045>>వివాదంపై<<>> దాఖలైన పిటిషన్ల విచారణార్హతను తేల్చాల్సి ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికనూ పరిశీలించాల్సి ఉందని వెల్లడించింది. ఆ తర్వాతే ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. రాజ్యాంగంలోని 25, 26 అధికరణ ప్రకారం పూజా విధానాల్లో మార్పులకు వీల్లేదని పిటిషనర్లు చెప్పారు. ఇరుపక్షాల వాదన నిమిత్తం కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.


