News December 4, 2024

ధోనీతో 10 ఏళ్లుగా మాటల్లేవు: హర్భజన్

image

ధోనీ, తాను దాదాపు 10 ఏళ్లుగా మాట్లాడుకోవడం లేదని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తెలిపారు. దీనికి కారణాలు ఏవీ లేవని, తామెప్పుడూ టచ్‌లో లేమని చెప్పుకొచ్చారు. IPLలో CSK తరఫున ఆడినప్పుడు చివరిసారిగా తాము మాట్లాడుకున్నామని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. గ్రౌండ్‌లో మాత్రమే మాట్లాడేవాళ్లమని, ఆ తర్వాత ఒకరి గదికి మరొకరు ఎప్పుడూ వెళ్లలేదన్నారు. యువరాజ్, ఆశిష్ నెహ్రాతో తాను రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటానని చెప్పారు.

Similar News

News March 28, 2026

BREAKING: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,510 పెరిగి రూ.1,48,090కు చేరింది. రెండు రోజుల్లోనే రూ.3,540 పెరగడం గమనార్హం. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,300 ఎగబాకి రూ.1,35,750 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.5వేలు పెరిగి రూ.2,50,000గా ఉంది.

News March 28, 2026

ఆయిల్ పామ్ తోటల్లో పచ్చిరొట్ట ఎరువులతో ప్రయోజనం

image

పచ్చిరొట్ట ఎరువులు పంటలకు మేలు చేస్తాయి. ఒకటి నుంచి మూడు సంవత్సరాల వయసు గల ఆయిల్ పామ్ మొక్కల పాదులలో మూడు అడుగుల దూరములో జనుమువేసి, పూతదశ వరకు పెంచిన తర్వాత దానిని చిన్నచిన్న ముక్కలుగా చేసి పాదులలో వేయాలి. ఈ విధంగా చేయడం వల్ల నీటి వృథా అరికట్టటమే కాకుండా నేలలో సేంద్రియ పదార్థాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. దీని వలన కలుపు మొక్కల బెడద తగ్గుతుంది.

News March 28, 2026

పాండ్య ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఇచ్చారా?

image

ముంబైలోని వాంఖడే స్టేడియం సిబ్బందికి హార్దిక్ పాండ్య రివార్డు ఇచ్చిన విషయం తెలిసిందే. ఒక్కొక్కరికి రూ.10 లక్షలు అందజేసినట్లు ప్రచారం జరిగింది. అదంతా అబద్ధమని ఒక్కొక్కరికి రూ.10వేల చెక్కు ఇచ్చారని నేషనల్ మీడియా క్లారిటీ ఇచ్చింది. కాగా టీ20 ప్రపంచకప్ కోసం పాండ్య వాంఖడే స్టేడియంలో అర్ధరాత్రి వరకు ప్రాక్టీస్ చేశారు. తనకు సహకరించిన గ్రౌండ్ స్టాఫ్‌కు రివార్డు ఇస్తానని అప్పుడే మాట ఇచ్చారు.