News August 26, 2024
మూడో ప్రపంచ యుద్ధం వద్దు: ట్రంప్

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల నడుమ డెమోక్రాట్లు వెలివేసిన బైడెన్ కాలిఫోర్నియా బీచ్‌లో సేదతీరుతున్నారని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సెటైర్లు వేశారు. మరోవైపు డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్‌తో కలిసి బస్సు యాత్రలో బిజీగా ఉన్నారన్నారు. ఇలా ఉంటే సంప్రదింపులు జరిపేది ఎవరని ప్రశ్నించారు. ఏమైనప్పటికీ మూడో ప్రపంచ యుద్ధం రావొద్దని ఆకాంక్షించారు.
Similar News
News November 22, 2025
అవకాడోతో కురులకు మేలు

అవకాడో ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచడంతోపాటు కురులకూ మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్-ఈ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అవకాడోని హెయిర్ ప్యాక్‌తో జుట్టు చిట్లడం తగ్గడంతో పాటు తొందరగా పెరుగుతుంది. అవకాడో, అరటి పండు పేస్ట్ చేసి టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేయాలి. దీన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి, గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా 15రోజులకొకసారి చేస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
News November 22, 2025
ఏడు శనివారాల వ్రతానికి దివ్య ముహూర్తం నేడే..

శని దోష నివారణ కోసం చేసే 7 శనివారాల వ్రతాన్ని నేడు ప్రారంభించడం శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు. ‘వ్రతాన్ని ఈరోజు మొదలుపెడితే వచ్చే ఏడాది JAN3 పౌర్ణమి రోజున పూర్తవుతుంది. పౌర్ణమి సంయోగం వల్ల అధిక ఫలితం ఉంటుంది. ఏడో వారానికి ముందు వైకుంఠ ఏకాదశి రావడం, వ్రత కాలంలో ధనుర్మాసం ఉండటం వల్ల శనిదేవుడు, విష్ణువు అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు’ అంటున్నారు. వ్రతం ఎలా చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News November 22, 2025
సమీకృత దాణాతో పశువులకు కలిగే మేలు

పశువుల పోషణలో భాగంగా పాడిపశువులకు సమతుల ఆహారం అందించడం ముఖ్యం. రోజూ అందించే దాణాతో పాటు సమీకృత దాణా కూడా అందిస్తే పశువులు ఆరోగ్యంగా ఉండటంతో పాటు పాల దిగుబడి కూడా పెరుగుతుంది. మనకు అందుబాటులో ఉన్న దినుసులను తగిన మోతాదులో కలిపి సమీకృత దాణాను తయారు చేయవచ్చు. ఇలా స్వయంగా తయారు చేసుకున్న దాణాలో మెులాసిస్ అరోమా పొడిని 250-500 గ్రాములు కలిపితే దాణా సువాసన కలిగి, రుచిగా ఉంటుంది.


