News October 10, 2025
కాసేపట్లో నోబెల్ పీస్ ప్రైజ్.. టాప్ కంటెండర్స్ వీరే

నార్వేజియన్ నోబెల్ కమిటీ ఇవాళ 2.30PMకు పీస్ ప్రైజ్‌ను ప్రకటించనుంది. ఈ అవార్డు కోసం ట్రంప్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఆయనతో పాటు ఎంతోమంది ప్రముఖులు రేసులో ఉన్నారు. 244 వ్యక్తులు, 94 సంస్థలు కలిపి మొత్తం 338 నామినేషన్స్ వచ్చాయి. రష్యా ప్రతిపక్ష నేత భార్య యూలియా, క్లైమెట్ యాక్టివిస్ట్ గ్రెటా థన్‌బర్గ్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ సహా UN ఏజెన్సీస్ వంటి పలు సంస్థలు పోటీపడుతున్నాయి.
Similar News
News October 10, 2025
నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

AP నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు అరెస్ట్ అయ్యారు. సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఆయనను గన్నవరంలో అదుపులోకి తీసుకున్నారు. 23 మందిని ఈ కేసులో నిందితులుగా పేర్కొనగా జనార్దన్ రావును ఏ-1గా చేర్చారు. కొద్దిరోజుల క్రితం ములకలచెరువులో నకిలీ మద్యం తయారుచేస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. జనార్దన్ రావు తన అనుచరులతో కలిసి కల్తీ మద్యం తయారుచేసి, ప్రభుత్వ వైన్స్‌లకు సరఫరా చేసినట్లు తేల్చారు.
News October 10, 2025
మహిళలను అరెస్టు చేయాలంటే..!

దేశంలో మహిళల రక్షణ, ఆత్మగౌరవం కాపాడేందుకు పలుచట్టాలున్నాయి. వాటిలో ఒకటి.. అరెస్టు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 43(5) ప్రకారం.. సూర్యోదయంలోపు, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత మహిళను అరెస్టు చేయరాదు. ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల్లో అరెస్టు తప్పదనుకుంటే ముందుగా మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలి. అరెస్ట్ చేయడానికి వచ్చిన టీమ్‌లో మహిళా పోలీసు అధికారి తప్పనిసరిగా ఉండాలి. <<-se>>#WOMENLAWS<<>>
News October 10, 2025
పెయ్య దూడకు జున్నుపాల ప్రాముఖ్యత

పశువు ఈనిన ఒక గంట లోపల దూడకు జున్ను పాలు తాగించాలి. ఈ సమయంలోనే జున్ను పాలలో రోగనిరోధక శక్తిని కలిగించే యాంటీబాడీస్‌ను దూడ వినియోగించుకునే శక్తిని కలిగి ఉంటుంది. ఆలస్యమైతే ఈ యాంటీబాడీస్‌ను జీర్ణించుకొనే శక్తి పెయ్యలో తగ్గుతుంది. జున్ను పాలలో తేలికగా జీర్ణమయ్యే మాంసకృత్తులు, విటమిన్-ఎ ఎక్కువగా ఉంటాయి. జున్ను పాలు తాగిన దూడలు 6 నెలల వయసు వరకు రోగనిరోధక శక్తిని ఎక్కువగా కలిగి ఉండి త్వరగా పెరుగుతాయి.