News October 14, 2025

మచాడోకు నోబెల్.. నార్వేలో వెనిజులా ఎంబసీ క్లోజ్

image

వెనిజులా ప్రతిపక్ష నేత మరియా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి రావడాన్ని ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మడురో జీర్ణించుకోలేకపోతున్నారు. నార్వేపై ప్రతీకార చర్యలకు దిగారు. అక్కడ తమ ఎంబసీని మూసివేయించారు. ఇందుకు అంతర్గత సర్దుబాటే కారణమని చెప్పారు. మడురో ప్రభుత్వం, ప్రతిపక్షాల వివాదానికి నార్వేనే మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఈక్రమంలోనే మచాడోకు నోబెల్ ప్రకటించడం మడురో ఆగ్రహానికి ఆజ్యం పోసినట్లయింది.

Similar News

News October 14, 2025

మోదీ, చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన పవన్

image

AP: రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ భాగస్వామ్యంపై Dy.CM పవన్ హర్షం వ్యక్తం చేశారు. ‘$15 బిలియన్ల పెట్టుబడితో విశాఖలో అతిపెద్ద AI డేటా సెంటర్ ఏర్పాటవుతోంది. రాష్ట్రంతో పాటు దేశానికి ఇది ఎంతో ముఖ్యం. చాలామందికి ఉపాధి లభించనుంది. యంగ్ ప్రొఫెషనల్స్‌కు టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. PM మోదీ, CM CBN, కేంద్ర మంత్రులు సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, మంత్రి లోకేశ్, సుందర్ పిచాయ్‌కి నా కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేశారు.

News October 14, 2025

కళ్లు చెదిరిపోయేలా ఉంది వర్మ.. మైండ్ బ్లోయింగ్

image

‘జైలర్’ మూవీలో కిరీటం చూసి ‘కళ్లు చెదిరిపోయేలా ఉంది వర్మ.. మైండ్ బ్లోయింగ్’ అని డైలాగ్ చెప్పడం గుర్తుందా. ఇప్పుడు నీతా అంబానీ హ్యాండ్‌బ్యాగ్ చూసినా ‘వర్త్ వర్మా.. వేరే లెవల్’ అనాల్సిందే. మనీశ్ మల్హోత్రా దీపావళి వేడుకల్లో నీతూ పాల్గొనగా అందరి దృష్టి ఆమె చేతిలోని బ్యాగ్‌పైనే. ఎందుకంటే దీని ధర ₹17.73కోట్లు. ‘Hermès Sac Bijou Birkin’కి చెందిన అత్యంత ఖరీదైన ఈ బ్యాగ్‌ తయారీకి 3,025 డైమండ్స్ వాడారట.

News October 14, 2025

డ్రిప్ సిస్టమ్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

సాగులో నీటి వృథా కట్టడికి వాడే డ్రిప్ వినియోగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పొలంలో ట్రాక్టర్‌లు, బండ్లు, పశువుల రాకపోకల వలన లేటరల్ పైపులు అణిగిపోకుండా చూడాలి. ఎలుకలు డ్రిప్ సిస్టమ్‌లోని లేటరల్ పైపులను, ఇతర భాగాలను కొరికేయకుండా ఉండాలంటే సిస్టమ్‌ను తరచూ వాడాలి. దీని వల్ల భూమి తేమగా ఉండి ఎలుకలు ఆ పైపుల దగ్గరకురావు. కలుపు తీసేటప్పుడు పదునైన పరికరాలు డ్రిప్ లేటరల్ పైపులను కోసేయకుండా జాగ్రత్తపడాలి.