News October 9, 2025

లిటరేచర్‌లో హంగేరియన్ రచయితకు నోబెల్ ప్రైజ్

image

2025కి గాను లిటరేచర్(సాహిత్యం) విభాగంలో హంగేరి రచయిత లాస్లో క్రాస్నాహోర్కాయ్‌(László Krasznahorkai)ను నోబెల్ ప్రైజ్ వరించింది. బైబిల్లోని ఆఖరి కాండానికి (అపోకలిప్సి) కళను జోడించి చేసిన ఊహాత్మక రచనకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఇప్పటివరకు రాయల్ స్వీడిష్ అకాడమీ మెడిసిన్, ఫిజిక్స్, <<17948685>>కెమిస్ట్రీ<<>> విభాగాల్లో బహుమతులు ప్రకటించింది. ఇంకా ఎకనామిక్ సైన్స్, పీస్ విభాగాల్లో ప్రైజ్‌లు ప్రకటించాల్సి ఉంది.

Similar News

News October 9, 2025

కోటరీ లబ్ధికే PPP పేరిట మెడికల్ కాలేజీల పందేరం: సజ్జల

image

తన సొంత కోటరీకి లబ్ధి కలిగేలా CBN PPP పేరుతో మెడికల్ కాలేజీలను కట్టబెడుతున్నారని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 7 నిర్మాణాలు పూర్తిచేస్తే, అందులో 5 CM ప్రైవేటుకు అప్పగించేశారని విమర్శించారు. పేదలకు అన్యాయం చేస్తున్న ఆయన చర్యలను తమ పార్టీ ప్రతిఘటిస్తుందని పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేపట్టామని పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

News October 9, 2025

సిల్వర్.. ధరలు చూస్తే ఫీవర్!

image

అందరూ బంగారం గురించే మాట్లాడుకుంటున్నారనో ఏమో <<17959732>>వెండి<<>> తన కోపాన్ని ధరలపై చూపిస్తున్నట్లుంది. కిలోపై వందో రెండొందలు పెరిగితే లైట్ తీసుకుంటున్నారని ఏకంగా రూ.వేలల్లో పెరుగుతోంది. దీంతో బంగారమే కాదు వెండిని సైతం కొనలేని పరిస్థితి నెలకొంది. గతేడాది కిలో రూ.లక్షకు చేరువైతేనే వామ్మో అనుకునేలోపే రూ.2లక్షల వైపు దూసుకెళ్తోంది. దీంతో సామాన్యుల కొనుగోళ్లు మందగించగా, కొందరు సిల్వర్‌లో పెట్టుబడులు పెడుతున్నారు.

News October 9, 2025

జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్!

image

AP: వచ్చే జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. నవంబర్ చివర్లో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని వెల్లడించారు. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామనే మాటకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. మార్చిలో డీఎస్సీ, స్పెషల్ డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు తమ చదువును కంటిన్యూ చేస్తే తప్పకుండా విజయం సాధించవచ్చు.