News October 19, 2025
నోబెల్ అవార్డు గ్రహీత కన్నుమూత

నోబెల్ అవార్డు గ్రహీత, భౌతిక శాస్త్రవేత్త చెన్ నింగ్ యంగ్ కన్నుమూశారు. 1922లో జన్మించిన ఆయన కణ భౌతిక శాస్త్రంలో సైంటిస్టుగా ఎదిగారు. 1957లో పరిశోధనలకుగానూ నోబెల్ బహుమతి అందుకున్నారు. 1964లో అమెరికా పౌరసత్వం పొందగా 2015లో వదులుకున్నారు. చైనా సంస్కృతి నరనరాల్లో ఉండటమే దానికి కారణమని ఓ సందర్భంలో చెప్పారు. ఆయన మరణాన్ని స్థానిక మీడియా ధ్రువీకరించింది.
Similar News
News February 5, 2026
వరుసగా మూడు రోజులు స్కూళ్లకు సెలవులు?

TG: వచ్చే వారంలో వరుసగా 3రోజులు స్కూళ్లకు సెలవు ఉండే అవకాశం ఉంది. ఈ నెల 13న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో పాఠశాలలకు హాలిడే ఇచ్చే ఛాన్స్ ఉంది. దీనిపై అధికారులు ప్రకటన చేయాల్సి ఉంది. ఇక 14న రెండో శనివారం, 15న ఆదివారం కావడంతో వరుసగా సెలవులు రానున్నాయి. కాగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తవ్వగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో 11న ఎలక్షన్ జరగనుంది.
News February 5, 2026
టెన్త్ స్టూడెంట్లకు సీజనల్ హాస్టళ్లు

AP: స్కూళ్లకు సరిగ్గా రాని టెన్త్ విద్యార్థుల కోసం సీజనల్ హాస్టళ్ల ఏర్పాటుకు విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా డివిజన్ స్థాయిలో 50 వసతి గృహాలను సోమవారం ప్రారంభించనుంది. స్థానిక టీచర్లు తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలను హాస్టళ్లకు తీసుకొస్తారు. అక్కడే వసతి, భోజనం సౌకర్యంతోపాటు ఉపాధ్యాయులతో తరగతులు, స్లిప్ టెస్టులు నిర్వహిస్తారు. టెన్త్‌లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి చేస్తారు.
News February 5, 2026
గ్రూప్-1 నియామకాలపై నేడు హైకోర్టు తీర్పు

TG: గ్రూప్-1 అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. నియామకాలపై హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ తీర్పు వెల్లడించనుంది. పరీక్షల నిర్వహణ, కరెక్షన్ వంటి నిబంధనల విషయంలో అభ్యంతరాలు ఉన్నాయని పలువురు గతంలో HCని ఆశ్రయించారు. దీంతో మెయిన్స్ ఫలితాలను రద్దు చేసి, తిరిగి మూల్యాంకనం చేయాలని సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. దీనిపై డివిజన్ బెంచ్ స్టే ఇవ్వగా ఇవాళ తీర్పుతో 562 పోస్టుల భవితవ్యం తేలనుంది.


