News November 28, 2024

పృథ్వీ షా నుంచి ఆటను ఎవరూ దూరం చేయలేరు: పాంటింగ్

image

టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీ షా టాలెంటెడ్ ప్లేయర్ అని పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అన్నారు. తిరిగి ఆయన IPLలో అడుగుపెడతారని చెప్పారు. ‘నేను కలిసి పని చేసిన టాలెంటెడ్ ప్లేయర్లలో పృథ్వీ ఒకరు. ఆయన నుంచి ఆటను ఎవరూ దూరం చేయలేరు. వేలంలో అన్‌సోల్డ్‌గా మిగలడం బాధాకరం. యాక్సిలరేటర్ రౌండ్‌లోనైనా పృథ్వీని ఎవరో ఒకరు తీసుకుంటారని భావించా. కచ్చితంగా మళ్లీ ఆయన తిరిగి వస్తారు’ అని రికీ పేర్కొన్నారు.

Similar News

News October 13, 2025

మేమూ వారి పద్ధతిలోనే USను గౌరవిస్తాం: చైనా

image

తమ ఉత్పత్తులపై US 100% అదనపు సుంకం విధించడంపై చైనా స్పందించింది. ‘పరస్పర ప్రయోజనాలకోసం అదేరకమైన టారిఫ్ వారిపైనా వేసి సమాన గౌరవం ఇస్తాం’ అని చైనా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. అమెరికా తీరు ఇలాగే ఉంటే తమ హక్కులు, ప్రయోజనాలు కాపాడుకోక తప్పదని పేర్కొంది. US తప్పుడు విధానాలను మార్చుకోవాలని విదేశాంగ అధికార ప్రతినిధి సూచించారు. కాగా తాజా టారిఫ్‌తో చైనా వస్తువులపై US టారిఫ్ భారం 130%కి చేరుతుంది.

News October 13, 2025

జొన్న సాగు.. మేలైన యాజమాన్య పద్ధతులు

image

తెలుగు రాష్ట్రాల్లో రబీలో జొన్నను OCT రెండో వారం వరకు విత్తుకోవచ్చు. ఎకరాకు 3KGల మోతాదు, మొక్కల మధ్య 15CM, వరుసల మధ్య 45CM దూరం ఉండేలా విత్తుకోవాలి. KG విత్తనానికి 5గ్రా. ఇమిడాక్లోప్రిడ్ 70 WS+ 2గ్రా కార్బెండజిమ్‌తో శుద్ధి చేయాలి. విత్తిన తర్వాత 35 రోజులపాటు కలుపు లేకుండా చూసుకోవాలి. దీనివల్ల మొక్క ఎదుగుదల బాగుంటుంది. అంతర పంటలుగా కంది 2:1 నిష్పత్తిలో వేసుకోవచ్చు. అపరాలను కూడా విత్తుకోవచ్చు.

News October 13, 2025

రూల్ ప్రకారం.. ఇంట్లో ఎంత బంగారం ఉండొచ్చు?

image

దేశంలో బంగారం కొనుగోళ్లను పర్యవేక్షించే ఆదాయ పన్ను శాఖ రైడ్స్ సమయంలో సరైన పత్రాలు చూపిస్తే ఎంత బంగారమైనా ఇంట్లో ఉంచుకోవచ్చు. అయితే పత్రాలు లేకున్నా పౌరుల వద్ద కొంతమొత్తంలో బంగారం ఉండేందుకు అనుమతి ఉంది. పెళ్లికాని మహిళలు: 250గ్రా, పెళ్లైన మహిళలు: 500గ్రా. పురుషులు: 100గ్రా. పసిడి కలిగి ఉండొచ్చు. వీటికి వారసత్వంగా, పెళ్లితో కానుకగా వచ్చిన గోల్డ్ అదనంగా ఉంటే అందుకు తగిన డాక్యుమెంట్స్ చూపాలి.