News June 25, 2024

UPI పేమెంట్స్‌ ఆప్షన్‌తో నోకియా ఫీచర్ ఫోన్లు

image

మూడు కొత్త ఫీచర్ ఫోన్లను భారత మార్కెట్లోకి నోకియా విడుదల చేసింది. 25 ఏళ్ల తర్వాత 3210 మోడల్‌ను మళ్లీ రిలీజ్ చేసింది. నోకియా 235 4జీ, నోకియా 220 4జీ పేరిట మరో 2 ఫోన్లను తీసుకొచ్చింది. వీటిలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి UPI పేమెంట్స్ చేసే ఆప్షన్ ఇచ్చింది. అలాగే యూట్యూబ్, యూట్యూబ్ మ్యూజిక్ ఫీచర్లను అందిస్తోంది.

Similar News

News November 2, 2025

ఎందరో నియంతలు పతనమయ్యారు.. తర్వాత రేవంతే: KTR

image

TG: రేవంత్ నకిలీ వాగ్దానాలు, బెదిరింపు రాజకీయాలు జూబ్లీహిల్స్ ఓటమితోనే అంతమవుతాయని KTR వ్యాఖ్యానించారు. ‘500 రోజుల్లో KCR తిరిగి సీఎం అవుతారు. ఎందరో నియంతలు పతనమయ్యారు.. తర్వాత రేవంతే. జూబ్లీహిల్స్‌లో భారీ మెజార్టీతో గెలుస్తాం. రేవంత్ చేసే బెదిరింపు రాజకీయాలకు భయపడేది లేదు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పతనం ఖాయం. రేవంత్‌కు కాంగ్రెస్‌తో ఉన్నది ఫేక్ బంధం. BJPతో ఉన్న‌ది పేగు బంధం’ అని విమర్శించారు.

News November 2, 2025

BREAKING: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

image

AP: రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్‌ల బదిలీలు, నియామకాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్‌గా మణికంఠ చందోలు, విజయవాడ సిటీ డిప్యూటీ కమిషనర్‌గా కృష్ణకాంత్ పటేల్, సైబర్ క్రైమ్ సీఐడీ ఎస్పీగా అదిరాజ్ సింగ్ రాణా, ఇంటెలిజెన్స్ ఎస్పీగా శ్రీనివాసరావు, ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా ఈజీ అశోక్ కుమార్‌ తదితరులను బదిలీలు, నియామకాలు చేశారు.

News November 2, 2025

4 ప్రాంతాల్లో SIR ప్రీటెస్టు సెన్సస్

image

AP: ECI దేశవ్యాప్తంగా SIR చేపట్టాలని నిర్ణయించడం తెలిసిందే. దీనిలో భాగంగా తొలివిడత ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రీటెస్ట్ నిర్వహించనున్నారు. ఈ ప్రీటెస్టు కోసం ఏపీలో 4 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను ఖరారు చేశారు. అల్లూరి(D) GKవీధి(M), ప్రకాశం(D) పొదిలి(NP), నంద్యాల(D) మహానంది(M), విశాఖ కార్పొరేషన్‌లోని 2, 3 వార్డులను ఎంపిక చేశారు. వీటిలో ప్రీటెస్ట్ నిర్వహణకు ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్లను నియమించారు.