News April 24, 2024
నామినేషన్ వేసిన పరిపూర్ణానంద

AP: హిందూపురం నుంచి ఆధ్యాత్మిక గురువు, శ్రీపీఠం వ్యవస్థాపకుడు స్వామి పరిపూర్ణానంద నామినేషన్ వేశారు. బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి టీడీపీ నుంచి బరిలో దిగనున్నారు.
Similar News
News October 25, 2025
పశుగ్రాస విత్తనాలు, పశుగణ బీమాకు నిధులు విడుదల

AP: పశుగణ బీమా, నాణ్యమైన పశుగ్రాస విత్తనాల ఉత్పత్తికి గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.3.39 కోట్ల నిధులను మంజూరు చేసింది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్(NLM) కింద ఈ నిధులను విడుదల చేశారు. ఈ నిధులను ఇతర పథకాలకు మళ్లించకూడదని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత శాఖకు స్పష్టం చేసింది. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
News October 25, 2025
సౌదీకి సైన్యాన్ని అద్దెకివ్వనున్న పాకిస్థాన్

ఇటీవల పాకిస్థాన్, సౌదీ మధ్య రక్షణ ఒప్పందం కుదరడం తెలిసిందే. ఎవరు దాడి జరిపినా ఇరు దేశాలూ ఎదుర్కోవాలని నిర్ణయించాయి. అయితే దీనిలో అసలు రహస్యం పాకిస్థాన్ తన సైన్యాన్ని అద్దెకు ఇవ్వనుండడం. 25వేల మంది సైనికుల్ని పాక్ సౌదీకి పంపనుంది. దానికి ప్రతిగా సౌదీ ₹88వేల CR ప్యాకేజీని పాక్కు అందిస్తుంది. పాక్ ఇప్పటికే రాజకీయ, ఆర్థిక సంక్షోభంతో అనేక రుణాలు తీసుకుంటోంది. అవీ సరిపోక ఈ అద్దె విధానాన్ని ఎంచుకుంది.
News October 25, 2025
భారత్ త్రిశూల విన్యాసాలు.. పాక్ నోటమ్ జారీ

పాక్ బార్డర్లోని సర్ క్రీక్ ప్రాంతంలో ఈనెల 30 నుంచి NOV 10 వరకు భారత త్రివిధ దళాలు త్రిశూల సైనిక విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న భారత్ NOTAM జారీ చేసింది. దీంతో పాక్ కూడా తమ సెంట్రల్, సదరన్ ఎయిర్స్పేస్లలో విమానాల రాకపోకలను రద్దు చేస్తూ నోటమ్ జారీ చేసింది. ఇందుకు ప్రత్యేకంగా కారణాలేవీ వెల్లడించలేదు. కాగా త్రిశూల విన్యాసాల వెనుక భారత వ్యూహమేంటని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


