News January 28, 2025
జూన్‌లోగా నామినేటెడ్ పదవుల భర్తీ: CBN

AP: పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. జూన్‌లోగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. త్వరలో 214 మార్కెట్ కమిటీలు, 1,100 ట్రస్ట్ బోర్డులకు నియామకాలు ఉంటాయని పేర్కొన్నారు. క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ సభ్యులనే సిఫారసు చేయాలని సీఎం సూచించారు.
Similar News
News December 5, 2025
DOB సర్టిఫికెట్లపై ఆ ప్రచారం ఫేక్: PIB

డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి 2026 ఏప్రిల్ 27 తుది గడువుగా నిర్ణయించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను PIB Fact Check ఖండించింది. వాట్సాప్‌లో వైరలవుతోన్న ఈ సమాచారం అవాస్తవమని స్పష్టం చేసింది. ప్రభుత్వం అలాంటి నోటిఫికేషన్ లేదా గడువును జారీ చేయలేదని పేర్కొంది. ఇలాంటి ఫేక్ న్యూస్‌ను షేర్ చేయొద్దని పౌరులకు సూచించింది.
News December 5, 2025
ఈ కంటెంట్ ఇక నెట్‌ఫ్లిక్స్‌లో..

Warner Bros(WB)ను నెట్‌ఫ్లిక్స్ <<18481221>>సొంతం<<>> చేసుకోవడంతో విస్తృతమైన కంటెంట్ అందుబాటులోకి రానుంది. 2022 లెక్కల ప్రకారం WBలో 12,500 సినిమాలు, 2,400 టెలివిజన్ సిరీస్‌లు(1,50,000 ఎపిసోడ్లు) ఉన్నాయి. దాదాపు 1,45,000 గంటల కంటెంట్ ఉంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్, ది బిగ్ బ్యాంగ్ థియరీ, హ్యారీపొటర్, ది సోప్రానోస్, ఫ్రెండ్స్, ది మెంటలిస్ట్, సూపర్ న్యాచురల్, ది వైర్ లాంటి సూపర్ హిట్ సిరీస్‌లను WBనే నిర్మించింది.
News December 5, 2025
మోతాదు మించితే పారాసిటమాల్ ప్రమాదమే: వైద్యులు

సరైన మోతాదులో తీసుకుంటే పారాసిటమాల్ సురక్షితమేనని వైద్యులు చెబుతున్నారు. అయితే అధిక మోతాదులో వాడటం వల్ల లివర్ ఫెయిల్యూర్‌కు దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు. ‘రోజుకు 4 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోవద్దు. ఆల్కహాల్ సేవించినప్పుడు & ఉపవాసంలో ఉన్నప్పుడు ఈ మాత్రలు వేసుకోవద్దు. జలుబు/ఫ్లూ ట్యాబ్లెట్లలో కూడా పారాసిటమాల్ ఉంటుంది కాబట్టి రోజువారీ మోతాదును సరిచూసుకోవాలి’ అని సూచిస్తున్నారు.


