News January 6, 2025

సంక్రాంతి తర్వాత నామినేటెడ్ పదవులు భర్తీ: టీపీసీసీ చీఫ్

image

TG: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం సీట్లలో విజయం సాధిస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. సంక్రాంతి తర్వాత నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ విజయం కార్యకర్తల కష్టానికి ప్రతిఫలమని తెలిపారు.

Similar News

News December 5, 2025

అఖండ-2 సినిమా రిలీజ్ వాయిదా

image

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన అఖండ-2 మూవీ విడుదల వాయిదా పడింది. రేపు రిలీజ్ కావాల్సిన సినిమాను అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ తెలిపింది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని ట్వీట్ చేసింది. ఈ సినిమా <<18466572>>ప్రీమియర్స్‌<<>>ను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించగా తాజాగా రిలీజ్‌ను కూడా వాయిదా వేశారు.

News December 5, 2025

టుడే టాప్ స్టోరీస్

image

*రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను రిసీవ్ చేసుకున్న ప్రధాని మోదీ
*హార్టికల్చర్‌ హబ్‌కి కేంద్రం రూ.40వేల కోట్లు ఇస్తోంది: చంద్రబాబు
*తప్పుడు కేసులు పెడితేనే నక్సలిజం పుడుతుంది: జగన్
*ఏడాదిలోగా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభం: రేవంత్
*’హిల్ట్’ పేరుతో కాంగ్రెస్ భూకుంభకోణం: KTR
*మరోసారి కనిష్ఠానికి రూపాయి.. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూ.90.43కి పతనం

News December 5, 2025

క్రియేటివ్ సిటీగా అమరావతి: చంద్రబాబు

image

AP: అమరావతిలో నిర్మించే ప్రతి భవనం విలక్షణంగా ఉండాలని, పచ్చదనంతో ప్రస్ఫుటంగా కనిపించేలా ఉండాలని CRDA భేటీలో CM CBN సూచించారు. మౌలిక సదుపాయాల కోసం నాబార్డు ₹7,380 కోట్ల రుణానికి ఆమోదం తెలిపిందని చెప్పారు. నాణ్యతలో రాజీపడకుండా గడువుకన్నా ముందే నిర్మాణాలు పూర్తిచేయాలని ఆదేశించారు. తెలుగు ఆత్మగౌరవానికి, వైభవానికి ప్రతీకగా నీరుకొండ వద్ద ఎన్టీఆర్ విగ్రహం నిర్మించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు.