News September 24, 2024

నామినేటెడ్ పోస్టులు.. టీడీపీలో విభేదాలు?

image

AP: తొలి విడత నామినేటెడ్ పోస్టుల భర్తీతో టీడీపీలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇద్దరు పార్టీ అధికార ప్రతినిధులు రాజీనామా చేసే అవకాశముందని సమాచారం. వారికి పదవులు ఇవ్వకపోవడంతో పాటు భవిష్యత్‌పై హైకమాండ్ భరోసా ఇవ్వకపోవడంతో నిరాశకు గురైనట్లు వార్తలొస్తున్నాయి. కాగా మొత్తం 99 నామినేటెడ్ పోస్టులకు గాను తొలి విడతలో 20 మంది పేర్లను ప్రభుత్వం ప్రకటించింది.

Similar News

News December 17, 2025

రూపాయి పతనమైతే సామాన్యుడికి ఏంటి సమస్య?

image

రూపాయి విలువ పడిపోతే తమపై ఏ ప్రభావం ఉండదని సామాన్యులు అనుకుంటారు. ప్రత్యక్షంగా లేకున్నా ఎగుమతి, దిగుమతుల ఖర్చులు పెరగడంతో మందులు, ఎలక్ట్రానిక్స్, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయడానికి RBI వడ్డీ రేట్లు పెంచితే లోన్ల EMIలు పెరుగుతాయి. కంపెనీల ఖర్చులు పెరగడంతో ఇంక్రిమెంట్లపై ప్రభావం పడుతుంది. రిక్రూట్‌మెంట్లు తగ్గుతాయి. బోనస్, వేరియబుల్ పే తగ్గే ఛాన్స్ ఉంది.

News December 17, 2025

పూజలతో బ్రహ్మ రాసిన రాతను మార్చొచ్చా?

image

‘అంతా తలరాత ప్రకారమే జరుగుతుంది అన్నప్పుడు పూజలు ఎందుకు చేయాలి?’ అనే సందేహం కొందరిలో ఉంటుంది. అయితే బ్రహ్మదేవుడు నుదుటిపై రాత రాసేటప్పుడు ‘నేను రాసిన రాతను నేను కూడా తప్పించలేను. కానీ ఉపాసన, ఆరాధన, అర్చనల ద్వారా ఆ విధిని మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే పెడుతున్నాను’ అని కూడా రాశాడట. కాబట్టి, మన అర్చనలు, ఉపాసనలు, కర్మల ద్వారా మన విధిని మనం సవరించుకునే అవకాశం ఉంటుంది.

News December 17, 2025

సర్పంచ్ ఫలితాలు.. 3 ఓట్ల తేడాతో గెలుపు

image

TG: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కొంత మంది అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో సర్పంచ్ సీట్లు కైవసం చేసుకున్నారు. భద్రాద్రి జిల్లా గాంధీనగర్‌లో కాంగ్రెస్ బలపరిచిన బానోతు మంగీలాల్ 3 ఓట్ల తేడాతో విజయం సాధించారు. NZB జిల్లా బాన్సువాడ మం. నాగారంలో కాంగ్రెస్ మద్దతుదారు దౌల్తాపూర్ గీత 7 ఓట్ల తేడాతో గెలిచారు. కామారెడ్డి (D) జగన్నాథ్‌పల్లిలో కాంగ్రెస్ బలపరిచిన గోడండ్లు వెంకయ్య 8 ఓట్ల తేడాతో విజయం సాధించారు.