News November 10, 2024
తగిన వ్యక్తులకే నామినేటెడ్ పదవులు: CM

AP: దాదాపు 30 వేల దరఖాస్తులు పరిశీలించి తగిన వ్యక్తులకు <<14568142>>నామినేటెడ్ పదవులు<<>> ఇచ్చినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. నామినేటెడ్ పదవులు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. పదవులు పొందిన వారు పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. పదవులను బాధ్యతగా భావించి ప్రజల కోసం పనిచేయాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురైన వారికి అవకాశాలు కల్పించినట్లు పేర్కొన్నారు.
Similar News
News December 29, 2025
కశ్మీర్లో బౌద్ధం: ఫ్రాన్స్ మ్యూజియం ఫొటోల్లో 2000 ఏళ్ల చరిత్ర

ఫ్రాన్స్ మ్యూజియంలోని కొన్ని పాత ఫొటోలు కశ్మీర్ 2000 ఏళ్ల నాటి బౌద్ధ చరిత్రను వెలుగులోకి తెచ్చాయి. జెహన్పొరాలో జరిగిన తవ్వకాల్లో పురాతన బౌద్ధ ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ ప్రాంతం ఒకప్పుడు బౌద్ధ సంస్కృతికి కేంద్రంగా ఉండేదని ప్రధాని మోదీ తాజా ‘మన్ కీ బాత్’లో చెప్పారు. ఒకప్పుడు సిల్క్ రూట్ ద్వారా కంధార్ వరకు విస్తరించిన బౌద్ధ నెట్వర్క్లో కశ్మీర్ కీలక పాత్ర పోషించిందని ఈ ఆధారాలు నిరూపిస్తున్నాయి.
News December 29, 2025
సైన్యంలో అవినీతి.. టాప్ జనరల్స్పై వేటు వేసిన జిన్పింగ్

చైనా సైన్యంలో అగ్రశ్రేణి అధికారులే అవినీతికి పాల్పడటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. తాజాగా ముగ్గురు కీలక సైనిక అధికారులపై పార్లమెంట్ బహిష్కరణ వేటు వేసింది. సెంట్రల్ మిలిటరీ కమిషన్ విభాగాల అధిపతులు వాంగ్ రెన్హువా, వాంగ్ పెంగ్తో పాటు ఆర్మ్డ్ పోలీస్ అధికారి జాంగ్ హాంగ్బింగ్ను పదవుల నుంచి తొలగించారు. సైన్యంలో ప్రక్షాళనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
News December 29, 2025
NHIDCLలో 48 ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (<


