News June 24, 2024
త్వరలోనే నామినేటెడ్ పదవులు: చంద్రబాబు

AP: సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలను నామినేటెడ్ పదవులతో గౌరవిస్తామని CM చంద్రబాబు తెలిపారు. TDP నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికలను ప్రతి ఒక్కరూ సవాల్‌గా తీసుకుని పోరాడటం వల్లే ఘనవిజయం సాధ్యమైంది. కూటమి కోసం కష్టపడిన వారి పేర్లు సేకరిస్తున్నాం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కార్యకర్తలను వేధించిన YCP నేతలకు TDPలోకి నో ఎంట్రీ’ అని వెల్లడించారు.
Similar News
News November 23, 2025
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నటిజమ్‌లో ఉద్యోగాలు

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నటిజమ్ 14 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిప్లొమా, టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ (ఫిజిక్స్, మ్యాథ్స్, జియోఫిజిక్స్,జియాలజీ, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్), ఎంఏ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు DEC 10 వరకు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్: https://iigm.res.in/
News November 23, 2025
పొంచి ఉన్న తుఫాను ముప్పు.. రైతుల ఆందోళన

AP: దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే సూచనలు కనిపిస్తుండటంతో రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో వరి కోతలు ముమ్మరంగా సాగుతుండగా, భారీ వర్షాలు పడితే పంట దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి, మిర్చి తోటలు, రబీ పంటలకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. వెంటనే ధాన్యాన్ని కుప్పలు వేసి, టార్పాలిన్లతో కప్పి భద్రపరచాలని అధికారులు సూచించారు.
News November 23, 2025
పత్తి రైతులకు తప్పని యాప్ కష్టాలు

పండించిన పంటను అమ్ముకోవడానికి ఇన్ని యాప్‌లలో నమోదుకు చేసుకోవాలా? అని కొందరు పత్తి రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పంట వేశాక ఈ-క్రాప్‌లో నమోదు చేసుకోవాలి. లేకుంటే పంట కొనరు. పంట చేతికొచ్చాక అమ్మడానికి రైతుసేవా కేంద్రంలో సీఎం యాప్‌లో నమోదు చేసుకోవాలి. తర్వాత CCIకి చెందిన కపాస్ యాప్‌లో నమోదు చేసుకోవాలి. ఈ మూడూ అనుసంధానమైతేనే పత్తిని రైతులు అమ్ముకోగలరు. ఈ విధానం రైతులకు ఇబ్బందిగా మారింది.


