News May 4, 2024

కుమారుడి నామినేషన్.. బ్రిజ్ భూషణ్ హడావిడి

image

తన కుమారుడు కరణ్ భూషణ్ నామినేషన్‌ సందర్భంగా భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ తన జనబలాన్ని చూపించే ప్రయత్నం చేశారు. ఏకంగా 10వేలమంది అనుచరులు, 700 వరకు వాహనాలతో భారీ ర్యాలీగా నామినేషన్‌కు వెళ్లారు. యూపీలో ఇది చర్చనీయాంశంగా మారింది. భూషణ్‌పై రెజ్లర్లు లైంగికారోపణలు చేసిన నేపథ్యంలో యూపీలో ఆయన ఎంపీగా ఉన్న కైసర్‌గంజ్ స్థానాన్ని బీజేపీ కరణ్‌కు కేటాయించిన సంగతి తెలిసిందే.

Similar News

News March 10, 2026

మెగా కోడలికి ఆన్‌లైన్ వేధింపులు.. కేసు నమోదు

image

తనపై ఓ వ్యక్తి SMలో వేధింపులకు పాల్పడుతున్నాడంటూ నటి, మెగా కోడలు లావణ్య త్రిపాఠి HYD సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘నా వ్యక్తిగత జీవితం, గౌరవాన్ని దెబ్బతీసేలా ‘Purple Crayon00’ ఇన్‌స్టా ఖాతా ద్వారా పోస్టులు, కామెంట్లు చేస్తున్నాడు. నా కుటుంబీకులనూ దూషిస్తూ అవమానిస్తున్నాడు. అతడిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని ఆమె పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News March 10, 2026

‘సారా’.. మళ్లీ కావాలంటోన్న MLA సారు.. మీరేమంటారు?

image

ఉమ్మడి APలో సారా సామాజిక, ఆర్థిక, కుటుంబ వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసింది. దానికి వ్యతిరేకంగా దూబగుంట రోశమ్మ స్ఫూర్తితో ఎంతో మంది తిరుగుబాటు చేయడంతో సారా నిషేధం అమల్లోకి వచ్చింది. అయితే ఇప్పుడు TGలో సారా షాపులు ఓపెన్ చేయాలని MLA అనిరుధ్ డిమాండ్ చేయడం <<19339452>>చర్చనీయాంశమవుతోంది<<>>. గతంలో సారా తాగి 115 ఏళ్లు బతికారంటూ అన్‌సైంటిఫిక్ వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై మీరేమనుకుంటున్నారు?

News March 10, 2026

వాళ్ల ఒత్తిడితోనే వెనక్కి తగ్గిన ట్రంప్?

image

ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా నాశనమైందని ట్రంప్ చెబుతున్నా.. యుద్ధం ముగింపునకు వచ్చిందన్న ప్రకటన వెనక ఆయన అడ్వైజర్ల ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. ఆయిల్ ధరలు పెరగడం, US ప్రజల మద్దతు లేకపోవడం, ఇరాన్ తగ్గే సూచనలు కనిపించకపోవడం, మిడ్ టర్మ్ ఎన్నికల నేపథ్యంలో రిపబ్లికన్లు యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఎక్కడ డెమోక్రాట్లకు ప్లస్ అవుతుందోనన్న భయం ఉన్నట్లు సమాచారం.