News August 5, 2024

రుణమాఫీ కానివారు ఈ నంబర్‌కు వాట్సాప్ చేయండి: BRS

image

TG: రుణమాఫీ జరగని రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్‌ను ప్రకటించింది. అర్హులై ఉండి ఇప్పటి వరకూ రూ.లక్ష, రూ.లక్షన్నర లోపు రుణాలు మాఫీ కాని వారు 8374852619 నంబర్ ద్వారా వాట్సాప్‌లో తమ వివరాలను తెలియజేయాలని సూచించింది. రేవంత్ ప్రభుత్వం ఇటీవల రూ.లక్ష, రూ.లక్షన్నరలోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేసిన సంగతి తెలిసిందే.

Similar News

News December 9, 2025

అధికారం కోల్పోయాక విజయ్ దివస్‌లు.. BRSపై కవిత విమర్శలు

image

TG: బీఆర్ఎస్‌పై జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ఇవాళ ఆ పార్టీ ‘విజయ్ దివస్’ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆమె సంచలన ట్వీట్ చేశారు. ‘అధికారం కోల్పోయాక దీక్షా దివస్‌లు.. విజయ్ దివస్‌లు. ఇది ఉద్యమాల గడ్డ.. ప్రజలు అన్నీ గమనిస్తున్నరు!!’ అని రాసుకొచ్చారు. పార్టీ నుంచి బయటికొచ్చాక బీఆర్ఎస్‌పై కవిత తరచూ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

News December 9, 2025

వీసా రూల్స్ అతిక్రమించిన చైనా సిటిజన్.. అరెస్ట్

image

2 వారాల నుంచి లద్దాక్, జమ్మూ కశ్మీర్‌లో తిరుగుతున్న చైనా గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ షెంజెన్‌కు చెందిన హు కాంగ్టాయ్‌ను సెక్యూరిటీ ఏజెన్సీలు అదుపులోకి తీసుకున్నాయి. ఢిల్లీ, UP, రాజస్థాన్‌లోని బౌద్ధ మత ప్రదేశాల సందర్శనకు NOV 19న టూరిస్ట్ వీసాపై అతడు ఢిల్లీ వచ్చాడు. రూల్స్ అతిక్రమించి లద్దాక్, J&K వెళ్లాడు. ఆర్టికల్ 370, CRPF బలగాల మోహరింపు, సెక్యూరిటీకి సంబంధించిన వివరాలు ఫోన్‌లో సెర్చ్ చేశాడు.

News December 9, 2025

లైన్ క్లియర్.. ఈ నెల 12న ‘అఖండ-2’ రిలీజ్!

image

బాలకృష్ణ అఖండ-2 <<18501351>>విడుదలకు మ<<>>ద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ నెల 12న సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రీమియర్స్, టికెట్ రేట్ల పెంపు కోసం నిర్మాణ సంస్థ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను సంప్రదించినట్లు తెలుస్తోంది. కాగా ఈ నెల 5న రిలీజ్ కావాల్సిన అఖండ-2 వాయిదా పడిన విషయం తెలిసిందే.