News July 25, 2024
వెజ్కి బదులు నాన్ వెజ్ డెలివరీ.. పట్టింపేది?

‘జొమాటో’లో వెజ్ ఆర్డర్ చేస్తే నాన్ వెజ్ డెలివరీ చేస్తోన్న ఘటనలు పెరుగుతున్నాయి. దీనిపై కస్టమర్లు X వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. న్యూఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి మష్రూమ్ బిర్యానీని ఆర్డర్ చేస్తే చికెన్ బిర్యానీ పంపించారు. మరొకరు వెజ్ మోమోస్ ఆర్డర్ చేస్తే చికెన్వి, ఓ గర్భిణికి వెజ్ పన్నీర్ తాలీకి బదులు నాన్ వెజ్ తాలీ డెలివరీ చేశారు. జొమాటో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవట్లేదని విమర్శలొస్తున్నాయి.
Similar News
News November 3, 2025
ఘోరం.. ఆనవాళ్లు లేకుండా మారిన బస్సు

రంగారెడ్డి జిల్లాలో టిప్పర్ ఢీకొట్టి మీద పడటంతో <<18183932>>బస్సు<<>> పూర్తిగా ధ్వంసమైంది. ముఖ్యంగా కుడివైపు ఉండే భాగం ఆనవాళ్లు లేకుండా అయింది. దీంతో ప్రమాద తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. టన్నుల కొద్దీ బరువు ఉండే కంకర మీద పడటంతో ప్రయాణికులు దాని కింద సమాధి అయిపోయారు. జేసీబీల సాయంతో టిప్పర్ను బస్సుపై నుంచి తొలగించారు. మృతదేహాలను చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ఉన్నట్లు సమాచారం.
News November 3, 2025
బస్సు ప్రమాదం.. దిక్కుతోచని స్థితిలో చిన్నారులు

TG: మీర్జాగూడ <<18183773>>ప్రమాదం<<>> పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఓ మహిళ మరణించగా ఆమె భర్తకు గాయాలవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో వారి ముగ్గురు పిల్లలు అదృష్టవశాత్తు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఓవైపు తల్లి మరణం, మరోవైపు ఆసుపత్రిలో తండ్రి ఉండటంతో ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఆ చిన్నారులు ఉండిపోయారు. ఈ దృశ్యం స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.
News November 3, 2025
తగ్గుతున్న ఆకుకూరల సాగు.. కారణమేంటి?

ఒకప్పుడు చాలా రకాల ఆకుకూరల లభ్యత, వినియోగం ఉండేది. ఇప్పుడు తోటకూర, మెంతి కూర, పాలకూర, పుదీనా, గోంగూర, కొత్తిమీర, బచ్చలికూరలనే మనం ఎక్కువగా వినియోగిస్తున్నాం. ఆకుకూరల సాగులో రైతుల కష్టం ఎక్కువగా ఉండటం, వరద ముంపునకు గురైతే పంట పూర్తిగా నష్టపోవడం వంటి కారణాల వల్ల.. రైతులు ఎక్కువ ధర పలికే కూరగాయలు, ఇతర వాణిజ్య పంటల సాగువైపు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా కాలక్రమేణా ఆకుకూరల సాగు, వినియోగం తగ్గుతోంది.


