News February 5, 2025

దేశంలో నాన్‌వెజ్ బ్యాన్ చేయాలి: శత్రుఘ్న సిన్హా

image

దేశంలో మాంసాహారంపై నిషేధం విధించాలని సినీనటుడు, టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా అభిప్రాయపడ్డారు. మన దేశంలో చాలా చోట్ల బీఫ్ బ్యాన్ చేశారని, అలానే నాన్‌వెజ్‌ను కూడా బ్యాన్ చేయాలన్నారు. నార్త్‌ఈస్ట్‌తోపాటు దేశంలో ఇంకా చాలా ప్రాంతాల్లో గొడ్డు మాంసం విక్రయాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఉత్తరాఖండ్ తీసుకొచ్చిన యూసీసీ (యూనిఫామ్ సివిల్ కోడ్) చట్టాన్ని ఆయన ప్రశంసించారు.

Similar News

News January 31, 2026

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మమ్దానీ తల్లి మీరా నాయర్ పేరు

image

ఎప్‌స్టీన్ తాజా డాక్యుమెంట్లలో భారత సంతతికి చెందిన ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్ పేరు తెరపైకి వచ్చింది. 2009లో ఆమె తీసిన ‘అమేలియా’ సినిమా తర్వాత సెక్స్ ట్రాఫికర్ మాక్స్‌వెల్ ఇంట్లో జరిగిన పార్టీకి హాజరయ్యారని ఈ ఫైల్స్ వెల్లడించాయి. ఈ ఈవెంట్‌లో క్లింటన్, బెజోస్ కూడా పాల్గొన్నట్లు ఓ ఈమెయిల్ ద్వారా బయటపడింది. న్యూయార్క్ మేయర్ మమ్దానీకి మీరా నాయర్ తల్లి కావడంతో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.

News January 31, 2026

నన్ను రిటైరవ్వమన్న వారికి థాంక్స్: జకోవిచ్

image

ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లిన టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ విమర్శకులపై సెటైర్లు వేశారు. ‘చాలామందికి నాపై నమ్మకం లేదు. కొందరు ఎక్స్‌పర్ట్స్ రిటైర్ అవ్వాలని సలహాలు కూడా ఇచ్చారు. ఆ మాటలు తప్పని నిరూపించేలా నన్ను మోటివేట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు’ అని ఎద్దేవా చేశారు. 25 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు 38 ఏళ్ల నొవాక్ అడుగు దూరంలో ఉన్నారు.

News January 31, 2026

టమాటాలు తింటే కలిగే లాభాలు తెలుసా?

image

▶ టమాటాల్లో ఉండే విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
▶ పొటాషియం, లైకోపీన్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
▶ BPని అదుపులో ఉంచి, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి.
▶ లైకోపీన్, బీటా-కెరోటిన్ చర్మాన్ని యవ్వనంగా చేస్తాయి.
▶ ఫైబర్, నీరు ఎక్కువగా ఉండడంతో గ్యాస్, ఉబ్బరం సమస్యలను దూరం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
▶ విటమిన్ K, కాల్షియం ఎముకల్ని బలంగా చేస్తాయి.
▶ క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తాయి.