News May 7, 2025
ఉత్తర కొరియా వద్ద 5 వేల టన్నుల ‘డెస్ట్రాయర్’ నౌక!

నౌకదళ సంపత్తి పరంగా ఉత్తర కొరియా మరింత బలోపేతమైంది. 5వేల టన్నుల బరువైన ‘మల్టీపర్పస్ డెస్ట్రాయర్’ నౌకను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాజాగా ప్రారంభించారు. దేశ అధికారిక మీడియా KNCA ప్రకారం.. అది చో హ్యోన్ క్లాస్‌కు చెందిన అత్యాధునిక నౌక. దాన్ని 400 రోజుల్లోనే ప్యాంగ్యాంగ్ నిర్మించింది. పలు రకాలైన క్షిపణుల్ని మోసుకెళ్లే సామర్థ్యం దానికి ఉంది.
Similar News
News April 4, 2026
ఇండక్షన్ స్టవ్‌ల తయారీకి ప్రభుత్వం బూస్ట్?

ఇండక్షన్ స్టవ్‌లు, హీటర్లు, వాటికి సరిపోయే పాత్రల తయారీని పెంచేలా కంపెనీలను ప్రోత్సహించేందుకు ఉన్న మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ వివిధ డిపార్ట్‌మెంట్లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. యుద్ధం వల్ల వంట గ్యాస్ కొరత తలెత్తిన నేపథ్యంలో ఇండక్షన్ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే.
News April 4, 2026
కాలం మారినా మన భూమి అందం మారలేదు!

చంద్రుడి కక్ష్యలోకి మనిషి వెళ్లిన 54 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తుచేస్తూ NASA ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. 1972లో అపోలో-17 వ్యోమగాములు తీసిన ఫొటోను, తాజాగా ఆర్టెమిస్-2 బృందం తీసిన చిత్రాన్ని పోల్చుతూ ట్వీట్ చేసింది. ‘కాలం మారినా అంతరిక్షం నుంచి మన భూమి అందం మాత్రం అస్సలు తగ్గలేదు’ అని పేర్కొంది. ఈ రెండు చిత్రాలు నాటి జ్ఞాపకాలను, నేటి సాంకేతిక అభివృద్ధిని మనకు గుర్తుచేస్తున్నాయి. దీనిపై మీ కామెంట్?
News April 4, 2026
ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. ఆ గ్రామాల్లో ఐస్‌క్రీమ్ బండ్లు నిషేధం!

TG: ఐస్‌క్రీమ్ కల్తీ నుంచి పిల్లలను కాపాడేందుకు నిజామాబాద్ జిల్లాలోని 3 గ్రామాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఐస్‌క్రీమ్ బండ్ల ప్రవేశాన్ని నిషేధించాయి. ఆర్మూర్(M) అంకాపూర్, జక్రాన్‌పల్లి(M) కొలిపాక, వేల్పూర్(M) అంక్సాపూర్ గ్రామాలు దీనిపై తీర్మానం చేశాయి. నిబంధన ఉల్లంఘిస్తే ₹5వేల జరిమానా విధిస్తామని ప్రకటించాయి. ఫుడ్ సేఫ్టీ రైడ్స్‌లో ఐస్‌క్రీమ్ కల్తీలు బయటపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి.


