News January 7, 2025

మరో క్షిపణిని పరీక్షించిన నార్త్ కొరియా

image

ఉత్తర కొరియా మరో హైపర్‌సోనిక్ క్షిపణిని పరీక్షించింది. దేశ అధికారిక మీడియా KCNA ఈ విషయాన్ని ప్రకటించింది. శబ్దవేగానికి 12 రెట్లు వేగంతో 1500 కి.మీ దూరం ప్రయాణించిన క్షిపణి లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించిందని పేర్కొంది. అయితే, క్షిపణి పరీక్ష నిజమే కానీ ప్యాంగ్యాంగ్ చెప్పే స్థాయిలో దాని సామర్థ్యం లేదని దక్షిణ కొరియా కొట్టిపారేసింది. అయితే ఆ ప్రయోగాలపై మాత్రం ఆందోళన వ్యక్తం చేసింది.

Similar News

News January 4, 2026

ప్రియాంకకు బిగ్ రోల్.. అస్సాం గెలుపు బాధ్యత ఆమె చేతుల్లో!

image

అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రియాంకా గాంధీకి కాంగ్రెస్ పెద్ద బాధ్యత అప్పగించింది. స్క్రీనింగ్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా నియమించింది. గెలిచే అవకాశం ఉన్న నేతలను షార్ట్‌లిస్ట్ చేయడం ఆమె ప్రధాన బాధ్యత. అక్కడ రాజకీయ పరిస్థితులు క్లిష్టంగా ఉండటంతో జాతీయ స్థాయిలో క్రేజ్ ఉన్న ప్రియాంకను రంగంలోకి దించడం ద్వారా క్యాడర్‌లో జోష్ నింపాలని పార్టీ భావిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీని ఆమె బలోపేతం చేయాల్సి ఉంటుంది.

News January 4, 2026

రోజూ 6-7 లీటర్ల పాలిచ్చే ఆవుకు ఎంత మేత ఇవ్వాలి?

image

సంకర జాతి పశువులకు వాటి పాల ఉత్పత్తిని బట్టి దాణాను అందించాలని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. రోజుకు 6 నుంచి 7 లీటర్ల పాలిచ్చే సంకరజాతి ఆవుకు ఈత ఈనిన తర్వాత లేదా పాలిచ్చే రోజుల్లో రోజుకు 20-25 కేజీల పచ్చగడ్డి, 5 నుంచి 6 కేజీల ఎండుగడ్డి, 3 నుంచి 3.5 కిలోల దాణా మిశ్రమం ఇవ్వాలి. అలాగే ఇదే పశువు వట్టిపోయిన సమయంలో రోజుకు 15-20 కేజీల పచ్చగడ్డి, 6-7 కేజీల ఎండుగడ్డి, 0.5-1 కేజీ దాణా మిశ్రమం ఇవ్వాలి.

News January 4, 2026

ESIC బిబ్వేవాడిలో 20 పోస్టులకు నోటిఫికేషన్

image

<>పుణే<<>>, బిబ్వేవాడిలోని ESIC హాస్పిటల్‌ 20 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 12, 13 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి MBBS, MD/DNB/DM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.300, SC,STలకు రూ.75. వెబ్‌సైట్: https://esic.gov.in/