News November 8, 2024

నార్త్ కొరియా దళాలకు భారీగా ప్రాణనష్టం: జెలెన్‌స్కీ

image

రష్యాకు మద్దతుగా తమపై యుద్ధానికి దిగిన ఉత్తర కొరియా దళాలకు భారీగా ప్రాణ నష్టం సంభవించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. ప్రస్తుతం 11వేల మంది కిమ్ సైనికులు ఉక్రెయిన్ సరిహద్దుల్లోని కుర్స్క్ రీజియన్‌లో ఉన్నారని తెలిపారు. తాము ప్రతిఘటించకపోతే మరింత మంది సైనికులను ఆ దేశం యుద్ధంలోకి తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు. ఉ.కొ సైనికులను పంపడంపై అమెరికా గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే.

Similar News

News October 29, 2025

పంట దిగుబడిని పెంచే పచ్చి ఆకు ఎరువు అంటే ఏమిటి?

image

కొన్ని రకాల చెట్ల నుంచి పచ్చి లేత కొమ్మలను సేకరించి పొలంలో వేసి కలియదున్నడాన్నే పచ్చి ఆకు ఎరువు అంటారు. పొలంలో దుక్కి చేసే రోజే లేత కొమ్మలు, ఆకులను చేనంతా వేసి భూమిలో కలియదున్నాలి. ఇది క్రమంగా కుళ్లి సేంద్రియ ఎరువుగా మారి మట్టిని సారవంతం చేస్తుంది. ఈ భూమిలో వేసిన పంటలు ఏపుగా పెరిగి అధిక దిగుబడులను ఇస్తాయి. కానుగ, సీతాఫలం, అవిశ, తంగేడు, వేప వంటి మొక్కలను పచ్చి ఆకు ఎరువు కోసం ఎంపిక చేసుకోవచ్చు.

News October 29, 2025

EPFO వేతన పరిమితి త్వరలో రూ.25వేలకు పెంపు?

image

EPFO వేతన పరిమితిని నెలకు ₹15,000 నుంచి ₹25,000కు పెంచే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ప్రస్తుతం బేసిక్ పే గరిష్ఠంగా ₹15వేల వరకు ఉన్న ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికులు మాత్రమే దీని పరిధిలోకి వస్తున్నారు. వారికి EPF, ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) అమలవుతున్నాయి. ఇప్పుడు ఈ పరిమితిని ₹25వేలకు పెంచే విషయంపై త్వరలో జరిగే EPFO సెంట్రల్ బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

News October 29, 2025

గుమ్మంపై ఎందుకు కూర్చోకూడదు?

image

ఇంటి గుమ్మం, మెట్లపై కూర్చోవడం అరిష్టమని పండితులు చెబుతున్నారు. ఇది లక్ష్మీదేవిని ఆహ్వానించే మార్గాన్ని అడ్డుకున్నట్టు అవుతుందని అంటున్నారు. ‘గడపను మనం దైవసమానంగా భావిస్తాం. అందుకే పర్వదినాల్లో అలంకరిస్తాం. అలాంటి దైవసమానమైన గడపపై కూర్చుంటే ఆ దైవాన్ని అవమానించినట్లే. సైన్స్ పరంగా.. ఇంట్లో నుంచి బయటకి వెళ్లే బ్యాక్టీరియాను, నెగెటివ్ ఎనర్జీని వెళ్లకుండా అడ్డుకున్నట్లు అవుతుంది’ అని అంటున్నారు.